తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారు_ పియూష్ గోయల్

తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశమయ్యారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతలు.. కేంద్రమంత్రితో పీయూష్‌ గోయల్‌తో ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ సీఎం వరుస ఓటములతో పరేషాన్ అవుతున్నారన్న పియూష్.. ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ మంత్రులకు పని లేదా? వచ్చి ఢిల్లీలో కూర్చున్నారంటూ వ్యాఖ్యానించారు. మా పనుల్లో మేం బిజీగా ఉన్నాం, వారికే పనీ లేదా? వచ్చి ఇక్కడ కూర్చున్నారంటూ అసహనం ప్రదర్శించారు. బాయిల్డ్‌ రైస్‌పై బలవంతంగా లెటర్ రాయించుకున్నాం అన్నమాట సరికాదన్నారు పియూష్‌ గోయల్‌.

అటు FCIకి ధాన్యం సరఫరాలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందన్నారు. సీఎం కేసీఆర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హుజురాబాద్‌లో ఓటమి తర్వాతే సీఎం కేసీఆర్ బియ్యం అంశాన్ని లేవనెత్తారని ఆరోపించారు. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి కూడా కేటాయింపులు చేసి రైతులను ఆదుకోవాలన్నారు కిషన్ రెడ్డి. రా రైస్‌, బాయిల్డ్ రైస్‌ రెండు కలిపి 27 లక్షల 39 లక్షల మెట్రిక్‌ టన్నులు రాష్ట్ర ప్రభుత్వం FCIకి సరఫరా చేయాల్సి ఉందన్నారు.