దొరలను దొరకబుచ్చుకొని గఢీలను గడగడలాడించగలరు..
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేకం ..
=================
అలగా జనం
ఏం చేయగలరు?
కల కనగలరు
ఐలమ్మలను
కనగలరు!
అలగా జనం
ఏం చేయగలరు?
దొరలను
దొరకబుచ్చుకొని
గఢీలను
గడగడలాడించగలరు!
అలగా జనం
ఏం చేయగలరు?
కలిసికట్టుగా
కల కనగలరు!
అలగా జనం
ఏం చేయగలరు?
మహనీయుల కలలు
కల్లలు కాకుండా
కదంకదం కలపగలరు!
అలగా జనం
ఏం చేయగలరు?
కలగా మిగిలిన
రాజ్యాధికారం కోసం
అలలలుగా
ఎగిసిపడగలరు!
_నీలం