ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ: నారా భువనేశ్వరి

TDP: రాష్ట్రం, ప్రజల కోసం కష్టపడటమే చంద్రబాబు చేసిన తప్పా అని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు. ప్రజల ఆదరాభిమానాలే చంద్రబాబుకు కొండంత అండ అని అన్నారు.  ప్రజల సొమ్ముకోసం ఆశపడే కుటుంబం తమది కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గంలో మహిళలు, టీడీపీ నేతలు చేపట్టిన నిరసత దీక్షలో సొమవారం భువనేశ్వరి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం ఆమె ప్రసంగించారు. 

‘‘చంద్రబాబు సింహంలా బయటకు వచ్చి ప్రజల  కోసం మళ్లీ పని చేస్తారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. ఆయన 45 ఏళ్ల రాజకీయ జీవితం ప్రజలతోనే ముడిపడి ఉంది.. ప్రజల్ని ముందుకు నడిపించడమే చంద్రబాబు లక్ష్యమని ఆమె తేల్చిచెప్పారు . అవినీతి మరక అంటించి 17 రోజులుగా జైల్లో పెట్టారని.. ఆయనేం తప్పు చేశాడని జైల్లో నిర్బంధించారని.? నిలదీశారు .ప్ర జల సొమ్ము ఆయనేమీ తీసుకోలేదని..మా కుటుంబానికి ప్రజల సొమ్ము అవసరం లేదని..  హెరిటేజ్ కంపెనీ నడుపుతున్నామని..అందులో 2 శాతం అమ్ముకున్నా రూ.4 వందల కోట్లు వస్తాయని అన్నారు.  అందరికీ ఎన్టీఆర్ వ్యక్తిత్వం  తెలుసని..సమాజమే దేవాలయం..ప్రజలే దేవుళ్లు  నమ్మే  వ్యక్తి నీడలో నేను పెరిగానని.. తాను, బ్రాహ్మణి ఏనాడూ బయటకు రాలేదని.. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నట్లు భువనేశ్వరీ వివరించారు.

 

Optimized by Optimole