Nancharaiah merugumala senior journalist:(చంద్రబాబు ప్రస్తుత కష్టాలకు రాజమండ్రి పేరును2..015లో రాజమహేంద్రవరంగా మార్చడమే కారణమా? గోదావరి తీరంలో జ్యోతిష్యులకు పెద్ద అనుమానం!)
=============
2015లో రాజమండ్రి ఇంగ్లిష్ స్పెలింగ్ నుR ajamandri అని సరళతరం చేయాల్సిన నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనవసరంగా దాన్ని సాగదీశారు. దాదాపు 500 సంవత్సరాల నుంచి రాజమహేంద్రి, రాజమండ్రి గా ఈ ఉన్న ఈ నగరం పేరును టీడీపీ అధినేత అనవసరంగా సాగదీసి రాజమహేంద్రవరం అని మార్చారు. ఉత్తరప్రదేశ్ లో బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దారిలో బాబు గారు రాజమండ్రి విషయంలో వ్యవహరించారు. ఐదొందల ఏళ్లుగా (మొఘలులు, కుతుబ్షాహీలు, అసఫ్ జాహీలు, బ్రిటిష్ వారి కాలం, తర్వాత 1947 నుంచి 2015 వరకూ) తెలుగు జనం నోటికి అలవాటైన రాజమండ్రి పేరు 8 ఏళ్ల క్రితం మార్చడం వల్లే చంద్రబాబు గారు ఇప్పుడు అదే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో కొన్ని వారాలు గడపాల్సి వస్తోందని కొందరు రాజమండ్రి జ్యోతిష్యులు వాపోతున్నారు. తాను సీఎంగా ఉన్న కాలంలో రాజమండ్రి పేరు జోలికి పోకుండా ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడు అని మార్చినా నారా వారికి శుభం, జయం కలిగేవని వారు అభిప్రాయపడుతున్నారు.