ధోని షాకింగ్ డెసిషన్.. నిరాశలో అభిమానులు!

ఐపీఎల్ 2022 ఆరంభానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ షాకింగ్ డెసిషన్ అందరినీ విస్మయానికి గురి చేసింది. మరో రెండు రోజుల్లో సీజన్ ఆరంభం కానున్న నేపథ్యంలో.. చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోని తప్పుకుంటున్నట్లు.. సీఎస్కే ఫ్రాంఛైజీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఈ సీజన్ నుంచి ధోని స్థానంలో.. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కెప్టెన్సీ బాధ్యత నిర్వర్తించనున్నట్లు వెల్లడించింది. ధోని నిర్ణయంతో.. సీఎస్కే అభిమానులతో పాటు అతని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది.

కాగా ఐపిఎల్ ప్రారంభం నుంచి ధోని.. ఆటగాడిగా, సారథిగా చెన్నై సూపర్‌కింగ్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతడి కెప్టెన్సీలో.. ఆ జట్టు ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టుగా నిలిచింది. అత్యధికంగా 11 సార్లు ప్లేఆఫ్స్ సాధించడంతో పాటు.. 9సార్లు ఫైనల్ చేరింది. నాలుగు సార్లు(2010, 2011, 2018, 2021) విజేతగా నిలిచింది.

Optimized by Optimole