భారత క్రికెటర్, నయా వాల్ చతేశ్వర్ పుజారా ఖాతాలో మరో అరుదైన ఘనత చేరబోతోంది . బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరీస్ లో రెండో టెస్ట్ మ్యాచ్ ఢిల్లీ వేదికగా ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ పుజారా కెరీర్‌లో 100 టెస్ట్ మ్యాచ్. భారత్ తరఫున ఇప్పటివరకు 100 టెస్ట్ మ్యాచ్ ఆడనున్న 13వ క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కనున్నాడు.
ఇప్పటివరకు టీంఇండియా తరపున కేవలం 12 మంది క్రికెటర్లకు మాత్రమే ఈ ఘనత దక్కింది. ప్రస్తుతం దేశానికీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లలో విరాట్ కోహ్లి మాత్రమే 100 టెస్ట్‌ల అరుదైన మైలురాయిని అధిగమించాడు. గత ఏడాది శ్రీలంకపై కోహ్లీ ఈ ఘనత సాధించాడు. కోహ్లి తన కెరీర్‌లో ఇప్పటివరకు 105 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
2010లో ఆస్ట్రేలియాపైనే టెస్ట్ అరంగేట్రం చేసిన పుజారా అదే ఆస్ట్రేలియాపై తన వందో టెస్ట్ కూడా ఆడటం విశేషం. భారత్ తరఫున ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన పుజారా 44.16 సగటున 3 ద్విశతకాలు, 19 శతకాలు, 34 అర్ధశతకాల సాయంతో 7021 పరుగులు చేశాడు.
2019-22 మధ్య కాలంలో పుజారా ఒడిదుడుకులు ఎదురుకున్నాడు. ఒక దశలో జట్టులో చోటు కోల్పోయాడు. ఇటీవలే ఇంగ్లాండ్ లో జరిగిన పరిమిత ఓవర్ల కౌంటీ సీజన్‌లో అదరగొట్టాడు. ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌లో గేర్ మార్చిన పుజారా.. తన సహజసిద్ధమైన ఆటకు భిన్నంగా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు మ్యాచ్లుల్లో నాలుగు శతకాలు సాధించాడు, అందులో రెండు ద్విశతకాలు ఉన్నాయి.
పుజారా ఆసీస్‌పై 21 మ్యాచ్‌ల్లో 52.77 సగటున 5 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 1900 పరుగులు చేశాడు. టెస్ట్‌లతో పాటు 5 వన్డేలు ఆడిన పుజారా 10.2 సగటున 51 పరుగులు మాత్రమే చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అంత పుజారా కెరీర్ ఆశాజనకంగా సాగలేదు. ఐపీఎల్ లాంటి లీగ్‌ల్లోనూ అంతంతమాత్రంగానే సాగింది. క్యాష్ రిచ్ లీగ్‌లో పుజారా ఇప్పటివరకు కేవలం 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్‌లో 99.74 స్ట్రయిక్ రేట్ కలిగిన పుజారా.. హాఫ్ సెంచరీ సాయంతో 390 పరుగులు చేశాడు.టెస్టుల్లో పుజారా కెర్రిర్ అద్భుతంగా సాగుతుంది. ద్రావిడ్ తన అభిమాన క్రికెటర్ అని చెప్పుకునే పుజారా నయవాల్ గా పేరుపొందారు. 2018లో ఇంగ్లాండ్ ఫై 104 బంతుల్లో 23 పరుగులు చేసాడు. మరో మ్యాచ్ లో ఒక పరుగు చేయడానికి 35 బంతులు ఎదుర్కున్నడూ. అంతకముందు ద్రావిడ్ 45 బంతుల్లో ఒకపరుగు సాధించాడు. ఆసీస్‌పై ఘనమైన రికార్డు కలిగిన పుజారా తన వందో టెస్ట్‌లో వంద కొట్టాలని ఆశిద్దాం.