రాష్ట్రంలో మరో సారి లాక్ డౌన్ ఉండదు : సీఎం కేసీఆర్

తెలంగాణలో లాక్ డౌన్ పై ముఖ్యమంత్రి కెసిఆర్ శాసనసభలో శుక్రవారం స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో మరోసారి లాక్ డౌన్ ఉండదని కెసిఆర్ స్పష్టం చేశారు.కోవిడ్ కేసుల పెరుగుదలపై ఎవరు భయపడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. వైరస్ కట్టడికి ప్రభుత్వం  తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ విషయమై ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. కరోనా కట్టడిలో భాగంగానే విద్యాసంస్థలు మూసివేసామని అన్నారు. రాష్ట్రంలోని పలు రంగాలకు సంబంధించిన పెద్దలు తనను కలిశారని, రాష్ట్రంలో మళ్ళీ లాక్ డౌన్ విధిస్తే చాలామంది నష్టపోతామని బాధగా చెప్పారని అన్నారు. అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందుకెళ్తుదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటికేే10.85 లక్షల మందికి కోవిడ్ టీకా ఇచ్చినట్లు వెల్లడించారు. టీకా  ఇచ్చే అంశం కేంద్రం పరిధిలో అయినా, వీలైనంత మందికి కి టీకా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కెసిఆర్ స్పష్టం చేశారు.