భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం బంగ్లాదేశ్ లో పర్యటించారు. బంగ్లాదేశ్ విమోచన దినోత్సవ, ఉత్సవాల్లో ఆయన విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆయనకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా డాకా విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.తొలుత పోరాట యోధులకు నివాళులర్పించిన మోడీ, అనంతరం మాట్లాడుతూ.. వారు ప్రాణాలను తృణప్రాయంగా వదిలిరారే తప్ప, ప్రశ్నించే తత్వాన్ని వీడనాడలేదని స్పష్టం చేశారు. అన్యాయం, అనిచివేత అంతం చేయడానికి విమోచన ఉద్యమం జరిగిందని, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని మోడీ అన్నారు.