ఎంపీ మహువా వ్యాఖ్యలపై స్పందించిన మమతా బెనర్జీ!

బెంగాల్ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న దీదీ మాట్లాడుతూ.. మనుషులు తప్పులు చేయడం సర్వసాధారణమని..వారికి సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని పరోక్షంగా మాట్లాడారు.ఇక మొయిత్రాపై పలు స్టేషన్లలో బీజేపీ నేతలు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

మరోవైపు మహువాని టీఎంసీ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ నేతల డిమాండ్ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ.. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు కట్టుబడిఉన్నానని.. తప్పు చేసినట్లయితే నిరూపించాలని పార్టీకి ఛాలెంజ్ విసిరారు. ఎవరికి భయపడే ప్రసక్తే లేదని మహువా స్పష్టం చేశారు.అంతేకాక పార్టీ అధికార ట్వట్టర్ ఖాతాను ఆమె అన్ ఫాలో చేసింది. ఎఫ్ఐఆర్ లను ఛట్టపరంగా ఎదుర్కొంటానని తేల్చిచెప్పింది.

ఓ చర్చ కార్యక్రమంలో పాల్గొన్న మొయిత్రా..కాళీమాతాపై చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. మీరు తెల్లవస్త్రాలు ధరించి దేవున్ని పూజించే స్వేచ్ఛ మీకున్నట్లే..కాళీమాతను మాంసాహారిగా, మద్యం స్వీకరించే దేవతగా ఊహించుకునే స్వేచ్ఛ తనకు ఉన్నదని .. భూటాన్ లేదా సిక్కింకు వెళితే.. అక్కడి వారు పూజలు చేసినప్పుడు దేవుడికి విస్కీ ఇస్తారని.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లి మీ దేవుడికి విస్కీని ప్రసాదంగా ఇస్తానని చెబితే దైవదూషణ అంటున్నారని ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది.