తాగిన మైకంలో మందుబాబు రచ్చ..వీడియో వైరల్!

సాధారణంగా మద్యం మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు.మైకం పక్కనున్న వారిని సైతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. అలాంటే ఘటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓవేడుకకు హాజరైన మందుబాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంతకు అతను చేసిన రచ్చ ఏంటంటే?

వైరల్ గా మారినా ఆవీడియోలో.. వేడుకకు హాజరైన మందుబాబు, మత్తులో కాకర పుల్లలు కాల్చడం మొదలెట్టాడు. కుడి చేతిలో ఒకటి ..మరో చేతిలో మరోకటి పట్టుకుని మహిళ వద్దకు వెళ్లి తూలుతు డ్యాన్స్ చేశాడు. ఈక్రమంలో అతని చేతిలోని కాకరపుల్ల..పక్కనేనున్న గడ్డివాముకి అంటుకుంది. ఇంకేముంది మంటలు చూస్తుండగానే వ్యాపించాయి. చేసింది చాలదన్నట్లూ ఆమందుబాబు.. మండుతున్న గడ్డిని చేతులతో తీసుకుని, కాళ్లతో తొక్కాడు. ఈవీడియోని  థామస్ అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.

 

ఇక ఈవీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అయ్యింది. 13 మిలియన్ల మంది వీక్షించారు. కొంతమంది నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తుండగా.. మరికొందరూ పెను ప్రమాదం తప్పిందంటూ క్యాప్షన్ జతచేశారు.