సీఎంయోగి పనితీరు భేష్ _ ప్రధాని మోదీ

కరోనా కట్టడిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పనితీరు పై ప్రధాని మోడీ అసంతృప్తిగా ఉన్నారన్న ఊహాగానాల కు తెరపడింది. తాజాగా తన సొంత నియోజకవర్గామైన వారణాసి లో పర్యటించిన మోడీ కరోనా కట్టడిలో యోగి ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా యోగి ప్రభుత్వం పని చేస్తుందని మోదీ కితాబు ఇవ్వడంతో అవన్నీ గాలి వార్తలే అని తేలిపోయింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది గడువు ఉండడంతో ప్రధాని మోదీ ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మోడీ 2.0 కొత్త కేబినెట్‌లోనూ రాష్ట్రానికి చెందిన పలువురు ముఖ్య నేతలకు క్యాబినెట్ పదవులు దక్కడంతో.. రాజకీయ సమీకరణాలు మరింతగా మారే ఛాన్స్ ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అంతేకాక ప్రధాని సీఎం యోగితో ఎప్పటికపుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు పలు సంక్షేమ పథకాలతో పాటు వేలకోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు.

తాజాగా వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని మోడీ..భారీస్థాయిలో నిర్మితమైన రుద్రాక్ష్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ ను ప్రారంభించారు. జపాన్ సాయంతో.. ఉన్నత కళానైపుణ్యంతో ఈ కేంద్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. వారణాసిలోని ఈ రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్ సదస్సులు, సమావేశాలు నిర్వహించుకునేందుకు పర్యాటకులను, వ్యాపారవేత్తలను ఆకర్షిస్తుందని తెలిపారు. భారత్, జపాన్ స్నేహ బంధానికి ఈ కన్వెన్షన్ సెంటర్ ఓ నిదర్శనమన్నారు. ఇది భారతదేశ ఆధ్మాత్మిక నగరం వారణాసికి తాము ఇస్తున్న కానుక అని ప్రధాని అన్నారు.
కాగా యోగి ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జనాభ నియంత్రణ బిల్లు సైతం మోడీ విసిరిన రామ బాణం గా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. యూపీలో నెలకొన్న రాజకీయ సమీకరణాలు దృష్ట్యా.. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువగా ఉన్నవారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవన్న కారణం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో జనాభా నియంత్రణ బిల్లు తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు.