కరోనా థర్డ్ వేవ్ పై టెడ్రోస్ ఆందోళన!

కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. డెల్టా వేరియంట్‌ వ్యాప్తితోపాటు జన సంచారం పెరగటం.. కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవటం.. ఇంకా కొన్నిదేశాలకు టీకా అందుబాటులోకి రాకపోవటం వంటిని థర్డ్ వేవ్ కి కారణమని తేల్చింది.

కరోనా డెల్టా రకం కేసులు పెరిగిపోతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఆందోళన వ్యక్తంచేశారు. దురదృష్టవశాత్తు మనమందరం థర్డ్‌ వేవ్‌ ప్రారంభంలో ఉన్నామంటూ హెచ్చరించారు. డెల్టా రకం వ్యాప్తికి తోడు సామాజిక కార్యకలాపాలు పెరగడం, ప్రజారోగ్య చర్యల్ని సరిగా పాటించకపోవడం, ప్రభుత్వాలు ఆంక్షలను సడలించడం వల్ల కేసులు, మరణాలు పెరుగుతున్నట్టు వ్యాఖ్యానించించారు. ఐరోపా, ఉత్తర అమెరికాలో వ్యాక్సినేషన్‌ రేటు పెరగడం వల్ల కొన్ని నెలలుగా కొవిడ్‌ కేసులు, మరణాలు తగ్గిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇలాంటి సానుకూల పరిస్థితుల నేపథ్యంలో తాజా తిరోగమన పరిస్థితులపై టెడ్రోస్‌ ఆందోళన వ్యక్తంచేసినట్టు ఓ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. వైరస్‌ నిరంతరం రూపాంతరం చెందుతుండటంతో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే డెల్టా వేరియంట్‌ చాలా దేశాలకు పైగా వ్యాపించిందని తెలిపారు.

ప్రపంచంలో అనేక దేశాలకు ఇప్పటివరకు ఏ వ్యాక్సినూ అందలేదన్నారు. అన్ని దేశాల్లోనూ సెప్టెంబర్‌ నాటికి కనీసం 10శాతం మంది జనాభాకు వ్యాక్సిన్‌ వేయించేలా చర్యలు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యాక్సిన్‌ ఒక్కటే ఈ మహమ్మారిని కట్టడి చేయలేదని, స్థిరమైన, సానుకూల విధానాలతో ముందుకు సాగాలని ప్రపంచ దేశాలకు ఆయన పిలుపునిచ్చారు. పూర్తి స్థాయిలో ప్రజారోగ్య వ్యవస్థను అందుబాటులో ఉంచడంతో పాటు సామూహిక సమావేశాలపై కట్టడిపై సమగ్ర విధానాన్ని అమలుచేయాల్సిన అవసరంఉందన్నారు. కఠిన నిబంధనలు అమలుచేయడం ద్వారా వైరస్‌ను కట్టడి చేయొచ్చని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *