కరోనా డెల్టావేరియంట్ విజృంభణ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. విస్తృత స్థాయిలో టీకా పంపిణీ ప్రక్రియ చేపట్టకపోవడం వల్ల వైద్యవ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇక జూలై మూడో వారం వరకు 111 దేశాల్లో డెల్టా వేరియంట్ వ్యాపించిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ వేరియంట్ కారణంగా కేసుల్లో పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. రానున్న నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్ తీవ్ర ప్రభావం చూపుతుందని అంచనా వేసింది.
చాలా దేశాల్లో కొవిడ్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వటం, ఎక్కువ మందికి టీకా పంపిణీ చేయకపోవడం వల్ల.. కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మృతుల సంఖ్య ఎక్కువవుతోంది. కాగా జులై నెలలో ప్రపంచ వ్యాప్తంగా ముప్పై లక్షల కరోనా కేసులు వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే కేసుల సంఖ్య 10శాతం పెరిగినట్లు చెప్పింది. జులై 5 నుంచి 11 వరకు 55 వేల మంది కరోనా ధాటికి ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇది అంతకుముందు వారంతో పోలిస్తే 3శాతం అధికమని చెప్పిం