‘నాట్ వెస్ట్ ట్రోఫీ ఫైనల్ ‘.. నూతన శకానికి ఆరంభం!

కొండంత లక్ష్యం..ఆరంభం బాగానే ఉన్నా తెరుకునే లోపే సగం వికెట్లు కోల్పోయింది టీం ఇండియా..క్రీజులో అనుభవం లేని యువ ఆటగాళ్లు కైఫ్ యువరాజ్..చూస్తుండగానే స్కోర్ బోర్డు 200 దాటింది..ఇద్దరి అర్ధ శతకాలు నమోదు..ఇంతలో యువరాజ్ ఔట్ మిగిలింది టేలండర్లు..లక్ష్యం 40 బంతుల్లో 48 పరుగుల చేయాల్సిన పరిస్థితి..కైఫ్ తో జతకట్టిన హర్బజన్ రావడంతో సిక్స్ కొట్టి ప్రెసర్ తగ్గించాడు.. మరోవైపు కైఫ్ దూకుడు పెంచాడు..లక్ష్యం14 బంతుల్లో 12 కొట్టాల్సిన పరిస్థితి..హర్బజన్ కుంబ్లే లను ఫ్లింటాఫ్ వరుస బంతుల్లో ఔట్ చేయడంతో ఒక్కసారిగా మ్యాచ్ ఉత్కంఠ..సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి..లక్ష్యం 7 బంతుల్లో 6 కైఫ్ బ్యాటింగ్ మరుసటి బంతి ఫోర్..ఫైనల్ ఓవర్ 6 బంతుల్లో 2 కొట్టాల్సి ఉండగా జహీర్ 2 రన్స్ పూర్తి చేయడంతో ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు..ఈ విజయంతో టీం ఇండియా వన్డేల్లో సరోకోత్త చరిత్రను సృష్టించింది.తేదీ జులై 13..2002..నాట్ వెస్ట్ సీరీస్ ఫైనల్ మ్యాచ్ అతిధ్య ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 325 భారీ లక్ష్యాన్ని టీం ఇండియా ముందుంచింది..బ్యాటింగ్ అరభించిన్నా ఇండియా 146 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది..క్రీజులో కైఫ్ ఉన్నాడు..ఏడవ స్థానంలో వచ్చినా యువరాజ్ కైఫ్తో జతకట్టి స్కోర్ బోర్డును పరుగులెత్తించారు.వీరిద్దరి జోడి తమ శైలిలో రెచ్చిపోయి అర్ధ శతకాలు సాధించడంతో స్కోర్ 200 పరుగులు దాటింది..విజయానికి చేరవవుతున్నా తరుణంలో యువరాజ్ ఔట్ అవ్వడంతో కొంత అనిశ్చితి నెలకొన్నా కైఫ్ ఒంటరిగా పోరాడుతూ టేలండర్లు హర్భజన్ జహీర్ లతో కలిసి భారీ లక్షాన్ని ఛేదించి భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
మ్యాచ్ గెలవగానే ఆటగాళ్ల సంబరాల్లో మునిగిపోగా.. డ్రెస్సింగ్ రూం బాల్కనీ నుంచి మ్యాచ్ వీక్షిస్తున్న కెప్టెన్ సౌరవ్ గంగూలీ చొక్కావిప్పి తిప్పడం అప్పట్లో సెన్సేషన్..అగ్రెసివ్ కెప్టెన్ గా పేరొందడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ.
యువఆటగాళ్ళు యువరాజ్-కైఫ్ రాణించడంతో టీం ఇండియాలో మార్పులకు శ్రీకారం చుట్టారు.టీం ఎంపికలో సైతం యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడం..బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయడం మొదలయింది..
యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించడంలో గంగూలీ ముందుండేవాడు..ఫలితంగా టీం ఇండియా ఎన్నో విజయాలు రికార్డులు నెలకొల్పేందుకు దోహదపడింది..ధోని రైనా కోహ్లీ రోహిత్ ఉతప్ప గంభీర్ లాంటి గొప్పఆటగాళ్లు వెలుగులోకి రావడం..టీం ఇండియా ప్రపంచ క్రికెట్లో శాసించే స్థాయికి చేరుకోవడం గంగూలీ ఆరంభించి పాటించినా యువమంత్రం. ధోని సైతం అసూత్రాన్ని పాటిస్తూ తన సారధ్యంలో టీం ఇండియాను చరిత్రలో లిఖించే రికార్డులును నెలకొల్పాడు.