రైతు ఉద్యమానికి అంతర్జాతీయంగా పలువురు ప్రముఖులు మద్దతు తెలుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా బాలీవుడ్ ప్రముఖులతో పాటు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా ట్వీట్స్ చేశారు. దీంతో సోషల్ మీడియా రాజకీయం మరింత వేడెక్కింది. ‘ఇండియా టు గెదర్’ హ్యష్ ట్యాగ్ తో ట్రెండ్ వుతున్న ఈ జాబితాలో బాలీవుడ్ నటులు, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, పలువురు ప్రముఖులు ఉండడం గమనార్హం.
భారత మాజీ క్రికెటర్ , సచిన్ టెండుల్కర్ కేంద్రానికి మద్దతుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మనమంతా సమైక్యంగా ఉండాలని, దేశ సార్వభౌమాధికారనికి విఘాతం కలగకుడదని హెచ్చరించారు. బాహ్య శక్తులు కేవలం ప్రేక్షకులగా ఉండాలని, దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. దేశానికి సంబంధించి ఏ నిర్ణయమైనా భారతీయులే తీసుకోవాలని సచిన్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
కాగా కెప్టెన్ కోహ్లి కేంద్రానికి మద్దతు తెలపడంతో సోషల్ మీడియాలో అతనిని ట్రోల్ ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు మా కెప్టెన్ కాదు హిట్ మ్యాన్.. రెండు పడవల ప్రయాణం మంచిదికాదని.. వివాదాస్పద అంశంలో తలదూర్చి వద్దని.. అంతేకాక రైతుల గురించి నీకేం తెలుసు, నీ కంటే పాప్ సింగర్ రిహనా ఎంతో బెటరని’ నెటిజన్స్ విమర్శలు చేస్తున్నారు.
ఇక కోహ్లి ట్వీట్ ను పరిశీలిస్తే.. ‘ విభేదాలు తలెత్తినపుడు మనమంతా ఐక్యంగా ఉండాలి.. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్యను అన్ని వర్గాల ఆమోదయోగ్యం తో శాంతియుతంగా పరిష్కరించుకొవాలి’ అని ‘ ఇండియా టు గెదర్’హ్యాష్ ట్యాగ్ అనుసంధానం తో విరాట్ ట్వీట్ చేశాడు.