బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ ‘ పఠాన్ ‘ మూవీని వివాదాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే సినిమాను బాయ్ కాట్ చేయాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. దాదాపు 10 లక్షలకు పైగా బాయ్ కాట్ ట్యాగ్ వైరల్ అవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పలువురు రాజకీయ నేతలు సైతం మూవీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ మూవీ విడుదలను వ్యతిరేకిస్తూ ఘాటైన విమర్శలు చేశారు.
ఇక దేశవ్యాప్తంగా పఠాన్”ని థియేటర్లలో నిషేధించాలనే డిమాండ్ తెరమీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో నటుడు అసెంబ్లి స్పీకర్ గౌతమ్ మాట్లాడుతూ..షారూఖ్ తన కూతురితో కలిసి ఈ సినిమా చూడాలని..చిత్రాన్ని చూస్తున్నట్లు ప్రపంచానికి తెలియజేసేలా సెల్ఫీ పోస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరో ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. పటాన్ మూవీ వివాదంపై అధికార బీజేపీ అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అటు మధ్యప్రదేశ్ ప్రతిపక్ష నేత డాక్టర్ గోవింద్ సింగ్.. మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరితో సహా సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఈ చిత్రాన్ని “మా విలువలకు విరుద్ధం” అంటూ వ్యతిరేకించారు.
ఇదిలా ఉంటే మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరి.. పఠాన్ సినిమాపై విమర్శనాస్త్రాలను సంధించారు. “ఈ వివాదం మూవీ గురించి కాదని..పరిధాన్ (బట్టలు)” గురించని అన్నారు. భారతీయ సంస్కృతిలో, ఏ స్త్రీ అయినా అలాంటి బట్టలు ధరించి, బహిరంగంగా ఆ దృశ్యాన్ని ప్రదర్శించడాన్ని ఏ మతస్తులు ఒప్పుకొరన్నారు. గత వారం హోమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం చిత్రంలోని పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు. పాటలోని దుస్తులు అభ్యంతరకరంగా ఉన్నాయని.. పాట డర్టీ మైండ్‌సెట్‌ను ప్రతిబింబిస్తుందని..కాస్ట్యూమ్స్‌లో కుంకుమ, ఆకుపచ్చ రంగులను ఉపయోగించిన విధానం కూడా అభ్యంతరకరమని.. మార్పులు చేయని పక్షంలో మధ్యప్రదేశ్‌లో సినిమాను ప్రదర్శించాలా వద్దా అనే విషయంపై చర్చిస్తామని” మిశ్రా పోస్టులో తెలిపారు.’పఠాన్’ నిర్మాతలు ‘బేషరమ్ రంగ్’ పాటను విడుదల చేసిన రెండు రోజుల తర్వాత నరోత్తమ్ మిశ్రా ఈ పోస్ట్ చేయడం గమనార్హం.