మిస్ ఇండియాగా సినీ శెట్టి!

కర్ణాటకకు చెందిన సినీ శెట్టి VLCC ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే టైటిల్ విజేతగా నిలిచింది. జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ ఫస్ట్ రన్నరప్‌గా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన షినతా చౌహాన్ ఫెమినా సెకండ్ రన్నరప్‌గా నిలిచారు.నటులు నేహా ధూపియా, డినో మోరియా, మలైకా అరోరా,డిజైనర్లు రోహిత్ గాంధీ, రాహుల్ ఖన్నా, కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ జ్యూరీ ప్యానెల్ సభ్యులుగా వ్యవహరించారు.

దేశం నలుమూలల నుండి వర్చువల్ ఆడిషన్స్ ద్వారా ప్రతిభావంతులైన యువతులను వెలికితీసేందుకు పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. వడపోత పద్ధతిలో ఇంటర్య్వూ ద్వారా 31 మందిని షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారిని అత్యత్తమ వ్యక్తులచే శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

ఇక పొటీల గురించి మాజీ ఫెమినా మిస్ ఇండియా నేహా ధూపియా మాట్లాడుతూ.. ఫెమినా మిస్ ఇండియా ప్రయాణంలో నేను పొందిన అమూల్యమైన అనుభవాల జ్ఞాపకాలను ఈపోటీలు గుర్తు చేసినట్లు చెప్పుకొచ్చారు. అందమైన, ప్రతిభావంతమైన యువతులతో కూడిన..ఈ ప్రయాణంలోని ప్రతిక్షణాన్ని అస్వాధించినట్లు ఆమె వెల్లడించారు.ఈవేడుకకు మనీష్ పాల్ హోస్ట్ గా వ్యవహరించగా.. కృతి సనన్, లారెన్ గాట్లీబ్, యాష్ చాండ్లర్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

Optimized by Optimole