ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్లో భారత్ స్టాండ్ బై కెప్టెన్ బుమ్రా సరికొత్త రికార్డు సృష్టించాడు. ఎడ్జ్ బాస్టన్ లో జరుగుతున్న ఐదవ టెస్టులో బుమ్రా మూడు వికెట్ల తీయడంతో.. సిరీస్ లో అతని వికెట్ల సంఖ్య 21 కి చేరింది. దీంతో ఒకే సిరీస్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా బుమ్రా చరిత్ర సృష్టించాడు. గతంలో భుమనేశ్వర్ కుమార్ పేరిట ఉన్న 19 వికెట్ల రికార్డును బుమ్రా అధిగమించాడు.
ఇక ఇంగ్లాడ్ లో అత్యధిక వికెట్ల తీసిన భారత బౌలర్ల రికార్డు పరిశీలించినట్లయితే..1959లో సుభాస్ గుప్తే 17 వికెట్లు పడగొట్టగా..2007 లో జహీర్ ఖాన్.. 2018లో ఇషాంత్ శర్మ 18 వికెట్లు తీశారు. 2014 లో భువనేశ్వర్ కుమార్ 19 వికెట్లు తీసి రికార్డు సృష్టించగా.. 2022(ప్రస్తుతం టెస్ట్ సిరీస్)లో బుమ్రా 21 వికెట్లతో చరిత్ర తిరగరాశాడు. మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో వికెట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.