రాజకీయ పార్టీల్లో ముదురుతున్న లోల్లులు..

telanganapolitics: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయో..?లేదో..? తెలియని పరిస్థితి.  ఎన్నికల నిర్వాహణ సంస్థ ‘‘ఎన్నికల సంఘం’’లో ఉలుకుపలుకు కనిపించడం  లేదు.  తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అన్నట్లుగా అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ 115 అభ్యర్థులను ప్రకటించింది. అభ్యర్థుల ఎంపిక, ప్రకటనలు చేయాలని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తొందర పడుతున్నాయి. టీకెట్ల ప్రకటన అనంతరం బీఆర్‌ఎస్‌లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో మొదలైన లొల్లి తుమ్మల నాగేశ్వర్‌రావు వరకు పాకింది.నేటికి అధికార పార్టీ ఆశావాహుల్లో టికెట్లు రాలేదన్న అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లోపోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వడబోత కార్యక్రమంలోనే నిమగ్నమయ్యాయి. అభ్యర్థుల ప్రకటన సంగతి ఎలా ఉన్నా..  ఖమ్మం కాంగ్రెస్‌ పార్టీలో లొల్లి మొదలైంది.  డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ పేరుతో బీజేపీకి అధికారంలో రావడం సంగతి అటుంచితే.. పార్టీలో ఉన్నవారు ఒక్కొక్కరుగా జారుకునే బాట పడుతుండటం కొస మెరుపు.
ఖమ్మం నుంచి మొదలైన కాంగ్రెస్‌ లల్లి..
పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అంటూనే..సొంత పార్టీ చెట్టుకొమ్మలను నరుక్కోనే సంస్కృతి కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతుంది. రాజకీయ కలహాల పార్టీగా ముద్ర పడిన కాంగ్రెస్‌ పార్టీ కుదటపడుతుందని భావిస్తున్న తరుణంలో సీనియర్ నేతల వేదికగా  ఖమ్మంలో జరిగిన మీటింగ్‌లో లొల్లి రగడ ఘటన హస్తం పార్టీని ఉల్కిపడేలా చేసింది. పార్టీలో మళ్లీ కుమ్ములాటలు మొదలైతే పార్టీ పరిస్థితి తిరోగమనంలోకి వెళ్లాల్సి ఉంటుందని అధిష్ఠానం భావిస్తోంది. కాని ఖమ్మంలో జరిగిన పార్లమెంటరీ స్థాయి కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల సమావేశంలో కాంగ్రెస్‌ దిగ్గజాలుగా ఉన్న వీహెచ్‌ హన్మంతరావు మాట్లాడుతున్న సమయంలో వీహెచ్‌ గో బ్యాక్‌ అంటు నినాదాలు చేయడం, భట్టి విక్రమార్క ఫోన్‌ మాట్లాడుకుంటు వెళ్లి పోవడం, పోంగులేటి, గీతారెడ్డి కార్యకర్తలను సముదాయించడం చూస్తే ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతుందనే భావన అందరిలో కలుగుతుంది. టికెట్ల ప్రకటన రాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. అభ్యర్థుల ప్రకటన అనంతరం  ఎలా ఉంటుందోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నెల 16,17న జరిగే సోనియా. రాహుల్‌, ప్రియాంక, ఖర్గెల మీటింగ్‌పై దృష్టిపెట్టిన కాంగ్రెస్‌ పెద్దలకు ఖమ్మం లొల్లి తలనొప్పిగా మారింది.  నిత్యం ఫైర్‌ బ్రాండ్‌గా ఉండే హన్మంతరావును ఖమ్మం మీటింగ్‌లో అవమానించడంపై ఆయన తీరు ఎలా ఉండబోతోందన్నవ చర్చ జరుగుతోంది.
ఖమ్మంలో రెడ్డి, చౌదరిల్లో ఉండే కోట్లాట వీహెచ్‌ హన్మంతరావు బీసీ నినాద వాఖ్యలు ఏ పరిణామాలకు దారి తీస్తుందోని అధిష్ఠానం భయపడుతోంది. పోంగులేటి వర్సెన్‌ రేణుకా చౌదరి, బట్టి గ్రూపుల్లో బీసీ వాదం చిచ్చు ఏ పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.
యెన్నంపై వేటుతో బీజేపీలో బయట లుకలుకలు..
తెలంగాణలో ఊపులో ఉన్న బీజేపీ మునుగోడు ఎన్నికల్లో ఓటమితో తిరోగమనంలోకి వెళ్లింది. మునుగోడు ఎన్నికలకు ముందుగా తెలంగాణలో బీజేపీ రెండోస్థానానికి ఎదిగింది. మునుగోడు ఎన్నికల ఓటమి, బీజేపీ నాయకుల్లో మొదలైన వర్గపోరు, పార్టీలో చేరిన కొత్తవారితో తలెత్తిన వివాదాలు చివరకు పార్టీ అధ్యక్షుడిని మార్చే స్థాయికి వెళ్ళింది. పార్టీ అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డిని నియామకం అనంతరం  పార్టీలో మార్పులు వస్తాయని ఆశించిన అధిష్ఠానానికి పార్టీలో చేరికలకు బదులు ఒక్కొక్కరుగా పార్టీని వీడడం  మింగుడుపడడం లేదు. ఇదే సమయంలో తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే.. మాత్రం 6011 దరఖాస్తులు పార్టీకి కొద్దిపాటిగా ఊరటనిచ్చింది. బీజేపీ నుంచి తెలంగాణ ఉద్యమ కారుడైన యెన్నం శ్రీనివాసరెడ్డిపై వేటు వేయడంతో ఆయన బయటకు వచ్చి.. బీజేపీ పరిస్థితిపై ప్రెస్‌మీట్‌ పెట్టి పార్టీలో కొనసాగుతున్న లుకలుకలపై చిట్టా విప్పడం వివాదస్పదం అయ్యింది. ఇలాంటి పార్టీలో చేరదామని చీకోటి వాళ్లు భారీ ఎత్తున పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్తే.. ఆయనను పార్టీలో చేర్చుకునే నాయకుడు అందుబాటులో ఉండక పోవడం మరో వివాదంగా ముసురుకుంది. చీకోటి చేసే చీకటి దందాల మరకలు పార్టీపై పడుతాయోనని బీజేపీ నాయకులు ఆయనను చేర్చుకోవడానికి జంకారనే ప్రచారం జరుగుతుంది. చేరికలు లేవు. ఉన్నవారు బయటకు వెళ్లి పోవడం చూస్తే.. తెలంగాణలో బీజేపీ పార్టీ మూడో స్థానానికి పడిపోయిందని స్పష్టమయ్యింది.
మైనంపల్లి హన్మంతరావు నుంచి తుమ్మల వరకు..
కాంగ్రెస్‌, బీజేపీ పార్టీల్లో లల్లులు ఒకతీరుగా ఉంటే.. అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ లల్లి మరో తీరుగా ఉంది. ఉన్న వాడికి తిండే ఆరుగదు..లేనివాడికి తిండే దోరకదు అన్నట్లుగా..సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మైరాజకీయ-పార్టీల్లో-ముదురునంపల్లి హన్మంతరావుకు టికెట్‌ ఇచ్చినా.. తన కుమారుడికి ఎందుకు ఇవ్వలేదని డిమాండ్‌ చేయడం, కన్నతల్లిలాంటి పార్టీ పెద్దలను దూషించడం ఆహంకారానికి పరాకాష్టగా నిలిస్తే.. తుమ్మల నాగేశ్వర్‌రావు కోసం పోంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి బడా నాయకుడిని దూరం చేసుకున్న అధికార పార్టీ తనకు పాలేరు నుంచి   టికెట్‌ ఇవ్వలేదని పోంగులేటి చెంతనకు చేరాలనే తుమ్మల ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే ..అధికార పార్టీలో టికెట్‌ వస్తుందని చాల మంది ఆశావాహులు సంవత్సరాలు అనేక కష్టానష్టాలకు ఓర్చి పార్టీకి అండగా నిలబడుతూ వచ్చారు. సీఎం కేసీఆర్‌ ఎవ్వరిని పట్టించుకోకుండా సిట్టింగులందరికి టికెట్లు ఇవ్వడం పట్ల ఆశావాహులు రగిలిపోతున్నారు. కాంగ్రెస్‌ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల స్థానాల్లోని ఆశావాహుల పరిస్థితి మరింతగా దారుణంగా ఉంది. పార్టీనే నమ్ముకున్న స్టేషన్‌ ఘన్‌నూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామాలో చిలుమర్తి లింగయ్య వల్ల వేముల వీరేశం, తాండూరు నుంచి ఫైలేట్‌ రోహిత్‌రెడ్డితో పట్నం హహేందర్‌రెడ్డి, మంచిర్యాలలో నడిపల్లి దివాకర్‌రావు వల్ల గడ్డం అరవిందరెడ్డి ఇలా ఒకటి కాదురెండు కాదు చాల నియోజకవర్గాల్లో ఆశావాహులు నిప్పురవ్వలైయి లేస్తున్నారు.
కేటీఆర్‌ మాటల వెనుక రాజకీయం ఏంటీ..?
డిసెంబరులో అందరు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్న రాజకీయ పార్టీలకు రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ మీడియా చీట్‌చాట్‌లో ఎన్నికలు ఏప్రిల్‌లో జరుగుతాయని బాంబు పేల్చారు. బీజేపీ పార్టీని మూడోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకరావడానికి జమిలి ఎన్నికలు, ముందస్తు ఎన్నికలు వంటి ఆస్త్రాలను వినియోగించడానికి బీజేపీ జరుపుతున్న ప్రయత్నాల్లో ఎన్నికలు వాయిదా పడుతాయే వాదనలు బలంగా వినవస్తున్నాయి. కాని బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాత్రం ఎన్నికలు డిసెంబరులోనే జరుగుతాయనే క్లారిఫికేషన్‌ అందరిని డోలాయమానంలో పడవేశాయి. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీని కట్టడి చేయడానికి అడుతున్న నాటకాలా..? కాదంటే నిజాలేనా..? సందేహాలకు తెర పడాలంటే ఎన్నికల కమిషన్‌ నోటీఫికేషన్‌ ఇస్తున్నామని చెప్పాల్సిన అవసరముంది.  కాదంటే తెలంగాణలో ఈ నెల 16,17న కాంగ్రెస్‌ అధినేత సోనియాగాంధీ, రాహుల్‌ గాంధి, ప్రియాంక, ఖర్గెలు వస్తు ఉండడం, మరో పక్కా బీజేపీ పార్టీన 17న జరిగే సభకు కేంద్ర హోంశాఖ మంత్రి ఆమిషా రావడంపై ప్రజలను డైవర్ట్‌ చేయడడానికి కేటీఆర్‌ ఇలాంటి జిమ్మిక్కులు చేశారా ..? అనే సందేహాలు తీరాలంటే ఎన్నికల కమిషన్‌ ఎన్నికల నిర్వాహణ ప్రకటన ఒక్కటే మార్గం.
===============================
బి. రాజశేఖర్‌, సీనియర్‌ జర్నలిస్టు
9573516755.
Optimized by Optimole