దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఐపీఎల్ ఆల్ టైం జట్టును ప్రకటించాడు. ఏబీ ప్రకటించిన జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా.. ఓపెనర్లుగా సెహ్వాగ్, రోహిత్ శర్మలను.. మూడో స్థానంలో కోహ్లీని ఎంపిక చేశాడు. నాలుగో స్థానం కోసం తనతో పాటు స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్ లను ఎన్నుకున్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా బెన్ స్టోక్స్ లకు జట్టులో స్థానం కల్పించాడు. బౌలింగ్ విభాగం విషయానికొస్తే , భువనేశ్వర్ కుమార్,కగిసో రబడా , జస్ప్రిత్ బుమ్రాను.. స్పిన్ విభాగంలో రషీద్ ఖాన్ ను జట్టులో తీసుకున్నాడు. మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ సీజన్ 2o21 ప్రారంభమవుతున్న నేపథ్యంలో డివిలియర్స్ ఈ జట్టును ప్రకటించడం విశేషం. ఐపీఎల్లో రాయల్ చాలెంజెర్స్ బెంగళూరు (ఆర్ సి బి) జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే.
ఎబ డివిలియర్స్ ఐపీఎల్ ఆల్ టైం ఎలెవన్ జట్టు : వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్/ స్టీవ్‌స్మిత్ / ఏబీ డివిలియర్స్, బెన్‌స్టోక్స్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్, కెప్టెన్), రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, కగిసో రబడ, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్.