రాబోయే మూడు నెలలు కీలకం : డాక్టర్ శ్రీనివాసరావు

కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు సూచించారు. ఏ మాత్రం ఏమరుపాటు పనికి రాదని స్పష్టం చేశారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని , కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు తప్పక పాటించాలని తెలిపారు. రాబోయే మూడు నెలలు చాలా కీలకమైనవని, ముఖ్యంగా పిల్లలు యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. 70% ఈ రెండు గ్రూప్ లో వాళ్లు ఎక్కువగా ఉన్నారని, మిగిలిన 30% మిడిల్, ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారని వారు స్పష్టంచేశారు. శనివారం ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారు మాట్లాడుతూ.. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం పటిష్ట చర్యలు అవలంబిస్తోందని అన్నారు. అందులో భాగంగానే కోవిడ్ కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో టెస్టుల సంఖ్య పెంచామన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. కోవింద్ అరికట్టాలంటే కేవలం వ్యాక్సిన్ ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టం చేశారు. అందుకు నిదర్శనం అమెరికా ఇజ్రాయిల్ వంటి దేశాలని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.