ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఆదివారం పంజాబ్తో జరిగిన పోరులో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(61; 51 బంతుల్లో 7×4, 2×6), మయాంక్ అగర్వాల్(69; 36 బంతుల్లో 7×4, 4×6) అర్థ సెంచరీలతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దీపక్ హుడా(22*), షారుఖ్‌ఖాన్(15*) ఫర్వాలేదనిపించారు. దిల్లీ బౌలర్లలో క్రిస్‌వోక్స్, రబాడా, అవేశ్‌ఖాన్, మెరివాలా తలా ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 196 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో దిల్లీ 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్(92; 49 బంతుల్లో 13×4 2×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ పృథ్వీషా(32; 17 బంతుల్లో 3×4, 2×6) స్టోయినిస్(27*; 13 బంతుల్లో 3×4, 1×6), లలిత్(12*; 6 బంతుల్లో 2×4) దిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించారు. పంజాబ్ బౌలర్లలో రిచర్డ్‌సన్ రెండు వికెట్లు తీయగా అర్ష్‌దీప్, మెరిడిత్ చెరో వికెట్ పడగొట్టారు.