ఐపీఎల్లో తాజా సీజన్లో చెన్నై జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాజస్థాన్ తో జరిగిన పోరులో 45 పరుగులతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. డుప్లెసిస్(33; 17 బంతుల్లో 4×4, 2×6), మొయిన్ అలీ(26; 20 బంతుల్లో 1×4, 2×6), అంబటి రాయుడు(27; 17 బంతుల్లో 3×6), సురేశ్ రైనా(18; 15 బంతుల్లో 1×4, 1×6), ధోనీ(18; 17 బంతుల్లో 2×4), బ్రావో(20నాటౌట్; 8 బంతుల్లో 2×4, 1×6) సమిష్టిగా రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో సకారియా మూడు, మోరిస్ రెండు, ముస్తాఫిజుర్, రాహుల్ తెవాతియా చెరో వికెట్ తీశారు. చెన్నై నిర్దేశించిన 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 143 పరుగులే చేసింది. ఓపెనర్ జోస్ బట్లర్(49; 35 బంతుల్లో 5×4, 2×6) రాణించగా..మిగత బ్యాట్స్‌మెన్స్ చేతులెత్తేశారు. చివర్లో జయదేవ్ ఉనద్కత్(24; 17 బంతుల్లో 2×4, 1×6), రాహుల్ తెవాతియా(20; 15 బంతుల్లో 2×6) ధాటిగా ఆడినా ఫలితంలేకుండా పోయింది. చెన్నై బౌలర్లలో మొయిన్ అలీ మూడు వికెట్లు తీయగా జడేజా, సామ్‌కరన్ రెండు.. బ్రావో, శార్దూల్ చెరో వికెట్ తీశారు.