×

పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం.

పుత్ర గణపతి  వ్రతం అంతరార్ధం!!
శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’ అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని  ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వులు , బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకే విధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదేవిధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదాంబ పార్వతి వరమిచ్చెను.

అట్టి జగదాంబ సమేత పుత్రగణపతి అనుగ్రహముపొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తి యుక్తలు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో పారాయణ చేసిన విశేషమైన ఫలితం.

పవిత్రమైన ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టి , స్వామివారిని షోడశ ఉపచారాలతో పూజించాలి. ఆయనకి ఇష్టమైన పిండివంటలను నైవేద్యంగా సమర్పించాలి. సాయంత్రం వేళలో కూడా స్వామిని పూజించి ఆ తరువాత ఉపవాస దీక్షను విరమించాలి. ఈ విధంగా నియమనిష్టలను ఆచరిస్తూ అంకితభావంతో ఈ వ్రతాన్ని ఆచరించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని చెప్పబడుతోంది. అలా ఈ రోజున ఈ వ్రతాన్ని ఆచరించి ఆ పుణ్యఫల పొందు పరాక్రమవంతులైన పుత్రులను పొందిన రాజులు ఎంతోమంది ఉన్నారు. ఈ రోజున ఎవరైతే తమకి పుత్ర సంతానం కావాలనే సంకల్పంతో వినాయకుడిని పూజిస్తారో వారి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవితో చెప్పినట్టుగా ఆధ్యాత్మిక గ్రంధాలు ప్రస్తావిస్తున్నాయి.

వినాయక వ్రతం మాదిరి ఆచరించాలి!  వినాయకచవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలే ప్రధానంగా ఆచరించాలి. పుత్ర సంతానం కావాలని పూజా సమయంలోనే స్వామివారికి దంపతులు అంకితభావంతో చెప్పుకోవాలి. బుద్ధిమంతుడు … జ్ఞానవంతుడు … ఆదర్శవంతుడైన పుత్రుడిని ప్రసాదించమని స్వామిని వేడుకోవాలి.  ప్రతి చవితి రోజున స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఆయన అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో పాటించాలి.  ఎవరైతే అంకితభావంతో గణపతిని మెప్పిస్తారో ఆ దంపతులకు అనతికాలంలోనే పుత్ర సంతానం కలుగుతుందని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి.

 ఫాల్గుణ శుద్ధ చవితి రోజున  పారాయణం చేయండి ఇలా..!

శ్లో।। ఙ్ఞానశక్తిముమాం దృష్ట్వాయద్‌ దృష్టం వ్యోమ్ని శంభునా ।
యచ్చోక్తం బ్రహ్మణా పూర్వంశరీరంతు శరీరిణామ్‌ ।।

శ్లో।। యచ్చాపి హసితం తేనదేవేన పరమేష్ఠినా ।
ఏతత్కార్య చతుష్కేణపృథివ్యాంచ చతుర్ప్యపి ।।

శ్లో।। ప్రదీప్తాస్యో మహాదీప్తఃకుమారో భాసయన్‌ దిశః ।
పరమేష్ఠి గుణైర్యుక్తః సాక్షాత్‌రుద్ర ఇవాపరః ।।

శ్లో।। ఉత్పన్నమాత్రో దేవానాంయోషితః సప్రమోహయన్‌ ।
కాన్త్యా దీప్త్యా తథా మూర్త్యారూపేణచ మహాత్మవాన్‌ ।।

శ్లో।। తద్‌ దృష్ట్వా పరమం రూపంకుమారస్య మహాత్మనః ।
ఉమానిమీషే నేత్రాభ్యాంతమ పశ్యతభామినీ ।।

శ్రీ పరమేశ్వర ఉవాచ –
శ్లో।। వినాయకో విఘ్నకరో గజాస్యో
గణేశ నామా చ భవస్య పుత్రః ।
ఏతేచ సర్వే తవయాన్తు భృత్యా
వినాయకాః క్రూరదృశః ప్రచండాః ।
ఉచ్చుష్మ దానాది వివృద్ధ దేహః
కార్యేషు సిద్ధం ప్రతిపాదయన్తః ।।

శ్లో।। భవాంశ్చ దేవేషు తథా ముఖేషు
కార్యేషుచాన్యేషు మహానుభావాత్‌ ।
అగ్రేషు పూజాం లభతేన్యధాచ
వినాశయిష్య స్యథ కార్యసిద్ధిం ।।

శ్లో।। ఇత్యేవ ముక్త్వా పరమేశ్వరేణ
సురైఃసమం కాంచన కుంభ సంస్థెః ।
జలై స్తథా సావభిషిక్తగా
త్రోరరాజ రాజేంద్ర వినాయకానాం ।।

శ్లో।। దృష్ట్వాబిషిచ్య మానంతుదేవాస్తం గణనాయకం ।
తుష్టువుః ప్రయతాః సర్వేత్రిశూలాస్త్రస్య సన్నిధౌ ।।

దేవా ఈచుః –
శ్లో।। నమస్తే గజవక్త్రాయనమస్తే గణనాయక ।
వినాయక నమస్తేస్తు నమస్తేచండ విక్రమ ।।

శ్లో।। నమోస్తుతే విఘ్నకర్త్రేనమస్తే సర్పమేఖహో ।
నమస్తే రుద్ర వక్రోత్థ ప్రలంబ జఠరాశ్రిత ।
సర్వదేవ నమస్కారాదవిఘ్నం కురు సర్వదా ।।

*శ్రీ పార్వత్యువాచ –*
శ్లో।। అపుత్రోపి లభేత్‌ పుత్రానధనోపి ధనం లభేత్‌ ।
యం యమిచ్ఛేత్‌ మనసాతం తం లభతి మానవః ।।

శ్లో।। ఏవంస్తుత స్తదాదేవైర్మహాత్మా గణనాయకః ।
అభిషిక్తస్య రుద్రస్యసోమస్యా పత్యతాం గతః ।।

శ్లో।। ఏతస్యాం యస్తిలాన్‌ భుక్త్వాభక్త్యా గణపతిం నృప ।
ఆరాధయతి తస్యాశు తుష్యతేనాస్తి సంశయః ।।

శ్లో।। యశ్చైతత్‌ పఠతే స్తోత్రంయశ్చైతచ్ఛ్రుణుయాత్‌ సదా ।
నతస్య విఘ్న జాయన్తేనపాపం సర్వథా నృప ।।

 

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole