టెస్టులకు డూప్లెసిస్ రిటైర్మెంట్!

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు,మాజీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ టెస్ట్ క్రికెట్ కు బుధవారం రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్ కు ప్రాధాన్యత ఇస్తానని అతను తెలిపారు. 36 ఏళ్ల డూప్లెసిస్ దక్షిణాఫ్రికా తరపున 69 టెస్టుల్లో 40.032 సగటుతో 4163 పరుగులు చేశాడు. అందులో 10 శతకాలు, 21 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడు కెప్టెన్గా  36 టెస్టులకు నాయకత్వం వహించాడు. అతని సారథ్యంల జట్టు 18 విజయాల్ని నమోదు చేసింది. ఇప్పటివరకు అతను 143 వన్డేలు, 50 టి-ట్వంటీ మ్యాచ్లు ఆడాడు. కాగా డూప్లెసిస్ ఐపీఎల్లో చెన్నై తరుపున అడుతున్నాడు. బ్యాటింగ్, ఫిల్డింగ్ తో చెన్నై జట్టు విజయాలలో అతను కీ రోల్ ప్లే చేస్తున్నాడు.