ఆన్ లైన్ గేమ్ ఆడాడు .. 39 లక్షలు గోవిందా!

online game

నేటి సమాజంలో పిల్లలు చేతికి మొబైల్​ ఇవ్వకపోతే నోట్లో ముద్ద కూడా పెట్టుకోనంతగా మారారు. ఫోన్లో గేమ్ ఆడటం పరిపాటిగా మారింది. అలాంటి ఓ పిల్లాడు తండ్రి మొబైల్ లో గేమ్ ఆడూతూ ఏకంగా రూ.39 లక్షలు పొగొట్టాడు. ఈఘటన ఉత్తర్ ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది.
ఆగ్రాలోని తాజ్​నాగ్రికు చెందిన ఓ విశ్రాంత సైనికుడి కుమారుడు.. తన తండ్రి ఫోన్లో తరుచూ గేమ్స్​ ఆడూతుండేవాడు. ఆడిన ప్రతిసారీ ఆటోమోడ్లో డబ్బులు చెల్లింపు అయ్యేవి. ఈక్రమంలో తండ్రి ఓ రోజు బ్యాంక్ ఖాతాలో డబ్బులు చెక్ చేయగా 39 లక్షలు మాయమైనట్లు గుర్తించాడు. వెంటనే దీనిపై ఆగ్రా రేంజ్​ సైబర్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి బ్యాంకు ఖాతా ఆధారంగా విచారణ చేపట్టగా.. సింగపుర్​లోని క్రాఫ్టన్ ఆన్​లైన్​ గేమింగ్​ కంపెనీ ఖాతాకు డబ్బులు బదిలీ అయినట్లు గుర్తించారు. విశ్రాంత సైనికుడి ఫిర్యాదు మేరకు ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి క్రాఫ్టన్ కంపెనీపై మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు.