Familystarreview: విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘ది ఫ్యామిలీ స్టార్ ‘. సెన్సేషనల్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ‘ గీత గోవిందం ‘ ఫేం పరశురామ్ దర్శకుడు. క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ ఈ మూవీపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇంతకు ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం..!
కథ :
గోవర్ధన్ ( విజయ్ దేవరకొండ ) ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఆర్కిటెక్ట్ ఇంజనీరింగ్ గా పనిచేస్తూ చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. పేరుకు తగ్గట్టుగా కుటుంబ బాధ్యతలతో లైఫ్ లీడ్ చేస్తున్న అతను తన ఇంటి మీద అద్దెకు ఉండే ఇందు( మృణాల్ ఠాకూర్) తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఇందు రాసిన ఓ పుస్తకం గోవర్ధన్ కంట పడుతుంది. ఇంతకు ఆ పుస్తకంలో ఏముంది? వాళ్ళ ప్రేమను ఏ విధంగా ప్రభావితం చేసింది? అసలు గోవర్ధన్ జీవితంలోకి ఇందు ఎందుకు వచ్చింది? చివరికి గోవర్ధన్ కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాడా? లేదా ? అన్నది తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
‘ ది ఫ్యామిలీ స్టార్ ‘ టైటిల్ కి తగ్గట్టుగా కుటుంబం కోసం ఎంత దూరమైన వెళ్లే యువకుడి కథే ఈ చిత్రం. ఫస్ట్ ఆఫ్ ఒకే. సెకండాఫ్ పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కుటుంబ సన్నివేశాలు ప్రేక్షకుడికి చిరాకు తెప్పిస్తాయి. ఆల్రెడీ ఈ తరహా సీన్స్ చూసేసాం రా బాబు అని ఫీలయ్యే విధంగా ఉన్నాయి. కథనం పరంగా సినిమా స్టార్టింగ్ మొదలు చివరి వరకు సాగదీసినట్లుగా అనిపిస్తుంది.సెకండ్ ఆఫ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. సన్నివేశంలో భాగంగా ” ఐ లవ్ యూ” అనే మాట ఓ వ్యక్తితో చెప్పేదికాదు ఓ కుటుంబానికి చెప్పేది అంటూ వచ్చే డైలాగ్ సినిమాకు హైలెట్.
ఎవరెలా చేశారంటే..?
సగటు మధ్యతరగతి యువకుడిగా విజయ్ దేవరకొండ ( vijay Devarakonda) తన పాత్రలో జీవించేశాడు. మృణాల్ ఠాకూర్ ( Mrunalthakur ) నటన పరంగా ఆకట్టుకుంది. హీరో_ హీరోయిన్ జోడి చూడ ముచ్చటగా అనిపిస్తుంది. దివ్యాంశ కౌశిక్, జగపతిబాబు ,వెన్నెల కిషోర్, ప్రభాస్ శీను, తదితరులు తమ తమ పాత్రల పరిధి మేర నటించారు.
దర్శకుడు పరుశురామ్ కథ పరంగా బలమైన అంశాన్ని ఎంచుకున్నప్పటికీ.. కథనం పరంగా సినిమాను మల్చడంలో విఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాలు,సంభాషణల్లో మాత్రం ఆయన మార్క్ కనిపిస్తుంది. సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే … ఫ్యామిలీ ” స్టార్ ” మెరుపులు వృథా ప్రయాసే..!
రివ్యూ: 2.5/ 5 ( సమీక్ష ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడింది)