Telangana: అన్ని పండుగల్లా రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలి..!

Telangana:   జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా LTI Mind Tree Foundation సహకారంతో భవిష్య భారత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జాతీయ రైతుల దినోత్సవ వేడుకలను గట్టు మండలం, బలిగెర గ్రామంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి (IVDP) లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా. బాలరాజు రాజారాం, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ మాట్లాడుతూ.. రైతులకు ప్రత్యేకమైన పండుగగా జాతీయ రైతు దినోత్సవాన్ని నిర్వహించుకోవాలన్నారు. రైతులు, రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ఆరోగ్యకరమైన వాతావారణాన్ని సృష్టించాలని రైతులను కోరారు. రైతులకు ప్రభుత్వాలు అండగా నిలబడుతున్నాయని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.అనంతరం రైతులను గుర్తు చేసుకునే పాటలతో విద్యార్థులు నాట్యాన్ని ప్రదర్శించారు.

సేంద్రియ వ్యవసాయం సాగు చేసే రైతు భీమేష్ మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడి భూమిని కలుషితం చేస్తున్నామని, మనం బాధ్యతతో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. మాచెర్ల స్కూల్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్య ఎంతో ముఖ్యమని రైతులని తమ పిల్లల్ని పత్తి చేళ్లకు పంపి పనులు చేయించవద్దని రైతులను కోరారు. ఈ కార్యక్రమం లో స్కూల్ కి దూరం అవుతున్న పిల్లల కోసం బలిగేర నుంచి మాచెర్ల వెళ్ళడానికి భవిష్య భారత్, LTI Mindtree తరపున సైకిల్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ లీడర్లు గోపాల్, మాచెర్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు, భవిష్య భారత్ లైవ్లీ హుడ్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, హరి కృష్ణ, సిఓ లు హలీమ్,లక్ష్మణ్, వాల్మీకి, ప్రతాప్, పార్వతీ, పరమేష్ గ్రామ రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole