టెస్ట్ క్రికెట్ పై రవిశాస్త్రి ఆందోళన…

టీంఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి టెస్ట్ క్రికెట్ మనుగడపై ఆందోళన వ్యక్తం చేశారు. వన్డే, టీ20 నేపథ్యంలో టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని ఆయన అన్నారు. తాజాగా ఓస్పోర్ట్స్ చానల్ తో మాట్లాడుతూ..క్రికెట్ నాణ్యతకు కోలమానమైన టెస్ట్ క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. టెస్ట్ క్రికెట్లో ఆడే జట్ల సంఖ్యను తగ్గించాలని సూచించాడు. పుట్ బాల్ మాదిరి క్రికెట్.. అనేక లీగులతో దూసుకుపోతుందని శాస్త్రి పేర్కొన్నాడు.

ఇక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ కు ఆదరణ పెరగాలంటే వన్డే , T20 క్రికెట్‌ జట్లను విస్తరించాలన్నారు శాస్త్రీ. క్రికెట్లో టెస్ట్ హోదాతో శాశ్వత జట్లు ఉండవని.. ఆరు అత్యుత్తమ జట్లు మాత్రమే ఉంటాయన్నాడు.ఆటలో నాణ్యత కోల్పోతే ఎవరూ చూడరని.. ప్రసారం చేసే చానళ్లు సైతం విముఖుత చూపే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఆటగాళ్ల ప్రతిభకు కోలమానం టెస్ట్ క్రికెట్ అని శాస్త్రి స్పష్టం చేశాడు.