జపాన్ మాజీ ప్రధాని షింజోపై ఆగంతకుడు కాల్పులు!

జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై ఆగంతకుడు కాల్పులు జరిపాడు. ఈవిషయాన్ని జపాన్ కు చెందిన ఓ వార్త సంస్థ వెల్లడించింది. పార్లమెంట్ ఎగువ సభ ఎన్నికల నేపథ్యంలో.. నరా ప్రాంతాంలో ప్రచారం నిర్వహిస్తున్న అబేపై 41 ఏళ్ల యమగామి టెట్సుయా కాల్పులు జరిపాడు . ఈఘటనలో తీవ్రంగా గాయపడిన అతనిని ఆస్పత్రికి తరలించారు.ఈ సమయంలో అతనిలో ఏమాత్రం చలనం లేనట్లు వార్తసంస్థ తెలిపింది.

 

మరోవైపు టోక్కో మాజీ గవర్నర్..షింజో కార్డియో పల్మనరీ స్థితిలో ఉన్నారంటూ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సాధారణంగా జపాన్ లో చనిపోయారని ధ్రువీకరించడానికి ముందు ఈపదాన్ని తరుచూ ఉపయెగిస్తారు. దీంతో షింజో అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Optimized by Optimole