బోయినపల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ శనివారం బెయిల్ పై విడుదలయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తీర్పునిచ్చింది. 15 రోజులకొకసారి బోయినపల్లి స్టేషన్లో రిపోర్ట్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అఖిల ప్రియ విడుదల సందర్భంగాచంచల్ గూడ జైలు వద్ద అనుచరులు ,కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
హఫిజిపేట భూవివాదానికి సంబంధించి ప్రవీణ్, సునీల్, నవీన్ ముగ్గురు సోదరులు కిడ్నాప్ కేసులో ఆమె అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆమెతో పాటు భర్త భార్గవ్ రామ్ , ఏవీ సుబ్బారెడ్డి లపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే ఆమెను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భర్త భార్గవ్ పరారీలో ఉన్నాడు అతని ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.