దేశంలోని అన్నిరంగాల్లో వెలకట్టలేని ఎందరో మహోన్నత వ్యక్తులను అందించిన నేల బెంగాల్ అని మోదీ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు, ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాత్రంతం కోసం పోరాడిన నేతల్లో నేతాజీ ఒకరని ,ఆయన చేసిన సేవలు, త్యాగాలు మరువలేనివని , ప్రతి భారతీయుడు ఆయనకు రుణపడి ఉంటాడని మోదీ పేర్కొన్నారు. నేతాజీ, పటిష్టమైన భారత్ కోసం కలలు కన్నాడని, ప్రస్తుత దేశాన్ని చూస్తే ఆయన భావన ఎలా ఉండేదో తలచుకుంటేనే ఏదోలా ఉందని .. మహిళలు హక్కుల కోసం పోరాడుతున్న తరుణంలో, స్వాత్రంత్యం కోసం వీరనారి ఝాన్సీ పేరుతో రెజిమెంట్ ఏర్పాటు చేసి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతోపాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , గవర్నర్ జగదీష్ ధనకర్ కూడా పాల్గొనడం విశేషం.