సాజిద్ ఖాన్ పై నటి లైంగిక ఆరోపణలు!

బాలీవుడ్లో నెపోటిజం(బంధుప్రీతి) , మీటూ ఉద్యమంపై (లైంగిక దాడి) గురించి ఏళ్ల నుంచి చాల మంది హీరోలు, హీరోయిన్స్.. దర్శకులు ప్రొడ్యూసర్స్ పై కామెంట్స్ చేయడం తరచు

జరుగుతుంది. యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య తరవాత నెపోటిజంపై.. తనుశ్రీ దత్తతోపాటు పలు ఇండస్ట్రీ హీరోయిన్స్ మీటూ ఉద్యమం పై పోరాడడంతో జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ జరిగిన విషయం తెల్సిందే.

తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ , సోషల్ మీడియా సెన్సేషన్ షెర్లిన్ చోప్రా దర్శకుడు సాజిద్ ఖాన్ పై ట్విటర్లో లైంగిక ఆరోపణలు చేయడంతో బాలీవుడ్లో మరోసారి హాట్ ఆఫ్ ది టాపిక్గా మారింది.

షెర్లిన్ డైరెక్టర్ సాజిద్ గురించి ట్విటర్లో పోస్టు చేస్తూ..2005లో నా తండ్రి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత అతనిని కలవడానికి వెళ్లగా, ప్యాంట్ విప్పి మర్మంగాన్ని చూపిస్తూ రిలాక్స్ అవ్వమాని అన్నాడన్ని.. వెంటనే నేను కోపంగా సమాధానమివ్వడంతో వెెనక్కితగ్గాడని షెర్లిన్ తెలిపింది.

దర్శకుడు సాజిద్ ఖాన్ పై ఇప్పటికే పలుమార్లు, చాలా మంది హీరోయిన్స్ ఆరోపణలు చేయడంతో ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఏడాదిపాటు నిషేధం విధించింది. అంతేకాక హౌస్ఫుల్-4 ప్రాజెక్టు నుంచి కూడా అతనిని తీసివేసిన విషయం తెల్సిందే.