ఫిబ్రవరిలో శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికలు..?

తెలంగాణలో పట్టభద్రుల శాసన మండలి స్థానాలకు, ఎన్నికల షెడ్యూల్ ను కేంద్రం ఎన్నికల సంఘం ఫిబ్రవరిలో ప్రకటించే అవకాశముంది.  ఎమ్మెల్సీలుగా రామచందర్ రావు(మహబూబ్నగర్- రంగారెడ్డి-హైదరాబాద్), పల్లా రాజేశ్వర్ రెడ్డి(నల్గొండ-ఖమ్మం-వరంగల్)ల, పదవీ కాలం మార్చి 29 న ముగుస్తుండడంతో , వారి స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. తుది ఓటర్ల జాబితా పూర్తవడం, ఎన్నికల పోలింగ్ స్థావరాలను గుర్తింపుతో ఎన్నికలకు మార్గం సుగమైంది. దీంతో ఏ క్షణమైనా ఎన్నికలకు కేంద్రం షెడ్యూల్ జారీ చేసే అవకాశముంది.

కాగా మహబూబ్నగర్ లో ఓటర్ల జాబితా ప్రకారం 5.17 లక్షల మంది ఓటర్లుండగా, వరంగల్ లో 4.91 లక్షల మంది ఓటర్లున్నారు. ఈ రెండు స్థానాల ఓటరు జాబితా సిద్ధం ప్రకారం పురుష ఓటర్లు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా మారబోతోన్నారు.