జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్  రావు బహిరంగ లేఖ..

జమిలి ఎన్నికల’ పై మోదీకి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు బహిరంగ లేఖ..

Hyderabad: జమిలి ఎన్నికల’ పై మాజీ ఎమ్మె ల్యే గోనె ప్రకాష్ రావు ప్రధాని మోదీకి బహిరంగ లేఖ రాశారు. మరో తొమ్మిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో అకస్మాత్తుగా  ‘జమిలి ఎన్నికలు’ గురించి  హడావుడి చేయడం ఒక విధంగా ఆశ్చర్యం కలిగించిందని ఆయన లేఖలో పేర్కొన్నారు .బుధవారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు .

ఈ సందర్భంగా  ప్రకాశ్ రావు మాట్లాడుతూ..నిజంగా ఎన్నికల వ్యవస్థలో, మన ప్రజాస్వామ్య ప్రక్రియలో సంస్కరణల పట్ల నిజాయితీతో మాజీ రాష్ట్రపతి శ్రీ రామనాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారా? అని లేఖలో ప్రధానిని ప్రశ్నించారు. నిజంగా జమిలి ఎన్నికలు జరపాలనే ఉద్దేశ్యం ఉంటే ముందుగా బిజెపి పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లండని సూచించారు.తరచూ ఎన్నికలు జరుపుతుండడంతో ఆర్థిక భారం అవుతుందన్న ప్రభుత్వ వాదనల్లో పసలేనివిగా భావిస్తున్నట్లు ప్రకాశ్ రావు స్పష్టం చేశారు.