హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేయడం పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం తీవ్రంగా స్పందించారు. “కేటీఆర్ పూర్తిగా మతిస్థిమితం కోల్పోయినట్లు మాట్లాడుతున్నారు,” అంటూ ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడాలి కానీ, రోడ్లపై చర్చలకు సవాళ్లు చేయడం ఏంటని గజ్జల కాంతం ప్రశ్నించారు. “సరే, రోడ్ల పైనే చర్చిస్తే, కేటీఆర్‌కి ఎమ్మెల్యే హోదా ? లేక సర్పంచ్ హోదా మాత్రమేనా?” ఉందా అంటూ విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ మొదటి రాజకీయ గురువు ఎన్టీఆర్, రెండో గురువు చంద్రబాబేనని పేర్కొన్న ఆయన, “తెలంగాణను కేసీఆర్ ఒక్కడే సాధించలేదని, కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నదని, అమరుల త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందని” గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డి తన స్వయం శక్తితో ముఖ్యమంత్రిగా ఎదిగారని ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నట్టు ప్రకటించిన గజ్జల కాంతం, “మీ స్థాయికి తగినవారిగా మా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చర్చకు వస్తారు,” అని అన్నారు.“మీరు నిజంగా చర్చకు సిద్ధంగా ఉంటే, మేమే ఏర్పాట్లు చేస్తాం. దేనిపైనా చర్చకు సిద్ధం,” అంటూ సవాల్ గజ్జెల కాంతం సవాల్ విసిరారు.