❝ పురాణాలలో వినాయకుడు ❞..

Ganeshchaturthi2023:గణేశ చతుర్థి కొన్ని రోజుల పాటు జరిపే వ్రతం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయంతో ముడిపడినది. మొదటి రోజు గణేషుడు పురుషుడిగా వుండి మరుసటి రోజు నుంచి స్త్రీగా మార్చబడి కొలుస్తుంటారు. మొదటి రోజు  గణేషుడుని విసర్జించి ఆ స్థానంలో గౌరిని నెలకొల్పుతారు. కొన్ని మొక్కలను, పెళ్లి కాని అమ్మాయిని ఉంచి ముత్తైదువలు పూజిస్తారు. మొక్కలను ఆ అమ్మాయి చేతిలో వుంచి ఇంటి గదులన్ని తిప్పించి “గౌరి గౌరి ఏమ్ చూస్తున్నావు” అంటే ” సిరిసంపదలను చూస్తున్నా” అనిపిస్తారు. ఇది మొదటి రోజులలో గణేష్ వ్రతం జరిగిన తంతు. ఇది పూర్తిగా ఆడవాళ్ల పండుగ. ముత్తైదువల పండుగ. ఇప్పుడు మగ ముత్తైదువల పండుగగ అయింది.

 గణేషుడి పుట్టుక!?

●స్త్రీ, పురుష ప్రమేయం లేకుండా జన్మించినవాడని, అతని జన్మ అసాధరణమైనదని ఓ కథ

●శివుడు కళ్ళు తెరుచినప్పుడు నవ్వాడు. ఆ నవ్వులోంచి వినాయకుడు పుట్టటం. అతను శివుని పోలికలతో  వుండడం వలన అమ్మవారు భర్తకు – బిడ్డకు తెడ వుండడం కోసం ఏనుగు తలనిచ్చింది. ఈ కథ వరాహ పురణంలోనిది. 

●కాళీ రూపంలో వున్న పార్వతిని శాంతింపచేయడానికి శివుడు ఒక క్లాత్ తీసుకుని ముడులు వేస్తూ చివరికి ఏనుగు తల వున్న బొమ్మ తయారు చేశాడు. ఆ బొమ్మను కాళీ మాత వక్షస్థలం దగ్గర తాకించగానే బొమ్మకు ప్రాణం వచ్చింది. ఈ కథ బృహధర్మ పురాణంలోనిది. 

●పార్వతి పసుపు ముద్దను గంగలో ముంచడంతో ప్రాణం పోసుకుంది. పార్వతికి, గంగకి ముద్దుల కుమారడుయ్యాడు. ఈ కథ పద్మ పురణంలోనిది. 

●బ్రహ్మ వైవర్త ప్రకారం. పార్వతి స్నానమాడే నూనే, తన శరిరంతో కలిపి వచ్చే మాలిన్యాన్ని ఏనుగు తల వున్న రక్షసైన మాలిని చేత తాగించింది. ఆమె గర్భం ధరించింది. ఆ బిడ్డే గణపతి. పుట్టిన కొద్దిసేపట్లోనే శనిదృష్టితో శిరస్సు కోల్పోవటం. విష్ణు మూర్తి ఏనుగు తల తెచ్చి అతికిచ్చినట్లు వుంది.  

●గణేషుడు తన తలను పుట్టక మునుపే కోల్పోయాడు. సింధూర అనే భూతం తల్లి గర్భంలోకి వెళ్ళి తలను తినేసింది. పుట్టిన బిడ్డే గజాసూరున్ని హతమార్చి తనకు తానే అతికించుకున్నట్లు స్కంద పురాణం చెబుతుంది. 

●గజరూపాలను ధరించి పార్వతి పరమేశ్వరులు చేసిన రతి క్రీడలో పుట్టినవాడు గణనాధుడు.

●హీనజాతులు ఆక్రమణల నివారణకై దేవతల మొర విని మలినమైన మట్టితో బొమ్మ చేశాడు శివుడు. అందుకే ఆ గణాలకు నాధుడయ్యాడు. 

● మనం చెప్పుకునే నలుగుపిండి కథ మీకు తెలిసినదే.

 

✤ వినాయక ఉత్సవం

 

●మొదటి దశలో గణపతుడి చేతిలో అంకుశం, విల్లు మాత్రమే వుండేవి. అవి వేటకు చిహ్నం. గణసమాజంలో ఒక నాయకత్వానికి సూచిక

●గణపతి ఆడ/మగ అంటే స్పష్టంగా చెప్పలేము. ఇది మొత్తంగా ఆడవారి పండుగ. వ్యవసాయం జీవన విధానమయ్యాక చతుర్థి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయుధాలకు బదులుగా వెలగపండు, నేరెడు పళ్ళు, దానిమ్మ, నారికేళం, మామిడి, పద్మం, కల్పవృక్షంలు జతయ్యాయి. వాటితో ఉత్సవం చేస్తారు.

●గణేషుడు-కుంకుమ

గణపతిని పూజించే సమయంలో, కుంకుమ ధరించాలి, కుంకుమ వస్త్రాలు ధరించాలి. గణపతి స్త్రీ మూర్తిగా, లక్షణాలతో వున్నాడో.. నెలసరి పవిత్రంగా చూడబడింది. సంతానానికి, సమాజ నిర్మాణానికి నెలసరి ప్రాధాన్యతను చాటిచెప్పటానికి పూజా సమయాలలో బహిష్టు రక్తం భావించారు. అనుసరించారు. ఈ విషయాలు “శంకర విజయం” తెలుపుతుంది.

నర్మద నదీతీరంలో గణేశ కుండం అనే చోట ఎర్రరాయి వుంది. అది గణేషుణి రాయి అంటారు. తప్పనిసరిగా గణపతి వ్రతంలో వుండాల్సిన ఐదురాళ్ళలో ఎరుపు మొదటిది. 

✤  ఇంతకు గణేషుడి దంతం ఎవరు విరగొట్టారు.?

●విష్ణు మూర్తి ఆరవ రూపమే పరుశరాముడు. అధర్మ రాజుల తలలు నరికి ఆ గొడ్డలి శివునికి అర్పిద్దామని కైలాసానికి వచ్చాడు. శివునికి గార్డుగా వున్న గణపతి పరుశ రాముడు వెళ్ళనివ్వలేదు. కోపంలో వినాయకుడిని తోసేసాడు. భారిగా వున్న వినాయక్ ఇంచుకూడా కదలేదు. ఇట్లా కాదని గొడ్డలితో ఒక వేటు వేసాడు. అంతే అది దంతం మీద పడి విరిగింది. ఈ కథంత తెలుసుకున్న పార్వతి ఉగ్రరూపంతో  దుర్గ రూపం ధరించింది. శాంతిచమని ఆ గొడ్డలిని వినాయకుని చేతిలో ఉండడం నేటి అంట్లోని మట్టి బొమ్మలోను చూస్తాం.. 

●అలాగే ఇంకో కథ వుంది. అదేమంటే తనను చూసి నవ్విన చందమామను కొట్టటానికి ఆయుధంగా వాడడం కోసం తుంచాడని.. 

 

✤ వినాయకుడి పొట్టమీది పాము కథ ఏమిటి

వినాయకుడు ఒకరోజు  స్వీట్లు, పిండివంటలు, పులిహోర లాంటివి చెడమడ తినటం. పొట్ట పగిలి పదార్థాలు బయటికి రావటంతో, పక్కనే పోతున్న పాముని పొట్టకు చుట్టి వేసాడు. అప్పటినుంచి బాన పొట్టతో జగత్తు శక్తిని కాపాడుతాడని భావన. కొన్నిసర్లు పాముని జంజ్యంగా, చేతిలో ఆడుకునే వస్తువుగా వాడుతాడు. 

 

● వినాయకుడు- ఎలుకలు

ఋషి పరాశరుడు తన ఆశ్రమమంతా ఎలుకలతో నిండివుండేవి. తీవ్రంగా బాధించేవి. ఇక లాభం లేదని వినాయకుడిని ఆర్థిస్తే.. వినాయకుడు వచ్చి ఎలుకలపై కూర్చోవటంతో.. అలా ఎలుక తనకు వాహనమైందని గణేశ పురాణం.

 

✤ వినాయకుని చాలా పర్సనల్/ ఫ్యామిలి విషయాలు

 

●ఎనుగు తల ధరించిన వినాయకుడిని జత చేసుకోవటానికి ఏ ఆడపిల్ల ముందుకు రాలేదు. అప్పుడు తల్లి పార్వతి అందమైన అరటి చెట్టుకు చీరకట్టి గణేషుడికి వివాహం జరిపిస్తుంది. ఇప్పటికి దుర్గా పూజలలో వినయకుడీ పక్కన అరటి చెట్టుకు చీరకట్టి వుంచడం(కేళా బాహు) చూస్తుంటాం..

●బ్రహ్మ తన మనుసునించి సిద్ది, రిద్ది అనే యిద్దరు అందమైన ఆడపిల్లలను సృష్టించాడు. వారిని వినాయకుడితో వివాహం జరిపించాడు. ఒకరు ఐశ్వర్యానికి మరోకరు జ్ఞానానికి ప్రతిక.

●సౌత్ ఇండియా కథల ప్రకారం వినాయకుడు బ్రహ్మచారి. 

● మరికొన్ని వాటిలో స్త్రీగా చెబుతారు. 

✤ మొత్తంగా వినాయకుడి గురించి చెప్పెవి. గణేషగీత, ముద్గుల పురాణం, గణేష పురాణం.

✤ వినాయకుడు హిందు మతంలో ఎంత ఆరాధకుడో, బౌద్ధంలో, జైనంలో కూడా. మూడు మతాలలో భిన్నమైన కథలున్నాయి. ఒక్కో ఎరియాలో ఒక్కో కథనం వుంది. వైవిధ్యం వుంది.  నమ్మలేని, ఉహకందని రీతిలో వినాయకుడి మీద కథలున్నాయి. వినాయకుడిని పూజించేవారి కంటే కథలను ఇష్టపడేవారికి ఈ కథనాలు మరింత ఆసక్తిని కలిగిస్తాయి. ఊహను పెంచుతాయి.

===========

———➻అరవింద్ ఏవి

Optimized by Optimole