సిలిండర్ ధరపై సామాన్య కూలీ పోస్ట్ వైరల్.. నెటిజన్స్ ప్రశంసలు!

గ్యాస్ సిలిండర్ ధరపై ఓసామాన్య కూలీ ప్రశ్నిస్తున్న పోస్ట్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కేంద్ర ప్రభుత్వంపై అక్కసుతో సిలిండర్ ధరపై.. అధికార టీఆర్ఎస్, కొన్ని పార్టీల నేతలు బాధపడడం చూస్తుంటూ జాలీవేస్తుందంటూ వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. సామాన్యునికి ఉన్న ఆలోచన.. నాయకులకు లేకపాయే అంటూ నెటిజన్స్ అతనికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకు వైరల్ గా మారిన పోస్టు సారాంశాన్ని పరిశీలిస్తే.. సిలిండర్ ధర పెరిగిందని అధికార టీఆర్ఎస్ నేతలు తెగ బాధపడిపోతున్నారు.ఐనా నాకు మాత్రం ఇబ్బందిలేదు.. ఎందుకంటారా? ధర పెరిగింది కేవలం రూ. 50 మాత్రమే.. ఒక్క సిలిండర్ నాకు మూడు నెలలు వస్తుంది. నెలకు భారం 17 రూపాయలు.. ప్రతి రోజు కూలీకి 20 km పోతాను.ఇంతకుముందు బస్సు చార్జ్ 15 రూపాయలు ఉండేది..కానీ తెలంగాణ ప్రభుత్వం పెంచిన టికెట్ల ధర వలన ఇప్పుడు 30 రూపాయలు అయ్యింది. రేట్స్ పెంచక ముందు నా నెల ఖర్చు 450 రూపాయలు..ఇప్పుడు 900 రూపాయలు అవుతోంది. ఇక తన కొడుకు బస్ పాస్ నెలకి 200 ఉండేది. ఇప్పుడు 800 రూపాయలు చేసిండ్రు. ఇంటి కరెంట్ చార్జీ నెలకు రూ. 120..ఇప్పుడు వచ్చేది రూ. 300.కేంద్రం పెంచిన ధర వలన భారం నెలకి 50 మాత్రమే. సీఎం కేసీఆర్ పెంచిన ధరల వలన 3 నెలలకు భారం 4000 వేలు అవుతోంది. గ్యాస్ ధర తగ్గే అవకాశం ఉంది. కానీ బస్సు, కరెంట్ చార్జ్ ఎప్పటీకి తగ్గవు కదా!ఇప్పుడు చెప్పండి అంటూ చేసిన పోస్ట్ వైరల్ అయ్యింది.

ఇక సామాన్య కూలీపోస్టుపై నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అతని పోస్ట్ ఆలోచింపజేసే విధంగా ఉందంటూ.. సామాన్యుడికి ఉన్న జ్ఞానం రాజకీయ నేతలకు లేకపాయో అంటూ కామెంట్ చేస్తున్నారు.