ప్రస్తుతం కాలంలో మొబైల్ మనిషిలో ఓ భాగం అయిపోయింది.లేచిన మొదలు పడుకునే వరకు ఫోన్లో గడపడం అలవాటుగా మారిపోయింది. అయితే అలవాటు క్రమంగా మనుషుల నుంచి జంతువులకు పాకిపోతోంది. ఓకోతి మనుషుల్లాగే ఫోన్ చూస్తూ.. ఆపరేట్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Craze Of Social Media🤦♀️🤦♀️ pic.twitter.com/UiLboQLD32
— Queen Of Himachal (@himachal_queen) July 10, 2022
ఈ వీడియో గమనించినట్లయితే.. ఓవ్యక్తి చేతిలో మొబైల్ పట్టుకుని ఉండగా కోతులు స్మార్ట్ ఫోన్ నూ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నాయి.ఇది చూసిన నెటిజన్స్ సరదాగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఈవీడియోనూ “సోషల్ మీడియా క్రేజ్” అనే క్యాప్షన్‌తో @himachal_queen అనే పేరు గల ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటికే వీడియోను 154.8K మంది వీక్షించగా.. 3 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.