బుమ్రాధాటికి చెతులేత్తిసిన ఇంగ్లాడ్.. తొలివన్డేలో భారత్ ఘనవిజయం!

ఇంగ్లాడ్ తో వన్డే సిరీస్ ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. మంగళవారం జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్ బుమ్రా విజృభించడంతో ఇంగ్లాడ్ చేతులెత్తిసింది. బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ ముప్పుతిప్పలు పెట్టాడు. అతని ధాటికి నలుగురు ఇంగ్లీష్ బ్యాట్స్ మెన్స్ డకౌట్ గా వెనుదిరిగారు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్లో రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శనతో బుమ్రా ఆకట్టుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాడ్ 25. 2 ఓవర్లలో 110 స్వల్ప స్కోర్ కే పరిమితమైంది. వికెట్ కీపర్ జోస్ బట్లర్(30) టాప్ స్కోరర్.భారత్ బౌలర్లలో బుమ్రా ఆరు.. మహ్మద్ షమీ మూడు.. ప్రసిద్ధ్ కృష్ణ ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన భారత్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 18.4 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (76) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (31) నాటౌట్ గా నిలిచాడు.

షమీ అరుదైన రికార్డు :
ఇంగ్లాడ్ తో మ్యాచ్లో భారత బౌలర్ మహ్మద్ షమీ అరుదైన మైలురాయిని అధిగమించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన నాలుగో బౌలర్గా నిలిచాడు. ఈమ్యాచ్లో షమి మూడు వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.