Hyderabad: కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణకు పెట్టుబడులు వెలువెత్తుతున్నాయి. తాజాగా జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ కల్లు ఆధారిత పరిశ్రమకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కని కలిశారు. కల్లుతో తదితర అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి తగిన సౌకర్యాలు కల్పించాలని టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పారిశ్రామిక వేత్త రోహిత్ తో కలిసి సీఎం, డిప్యూటీ సీఎంని కోరారు.
కాగా గతంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఫ్రొఫెసర్ జానయ్య కాంబోడియా స్టడీ టూర్ వెళ్ళినపుడు అక్కడ ఈ పరిశ్రమ ఎంతో ఆర్థికంగా ఉపాధి కల్పిస్తుండడంతో తెలంగాణ లో కూడా పరిశ్రమ ఏర్పాటు కు స్టీఫెన్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వీరి విజ్ఞప్తి మేరకు తెలంగాణ లో కల్లు ఆధారిత పరిశ్రమల్లో భాగంగా తాటి ఈత చెట్ల నుండి వైన్ & ఆరక్ తయారు చేసే పరిశ్రమ ఏర్పాటు చేస్తామని జర్మన్ ప్రతినిధి స్టీఫెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు.
ఇక కల్లుతో తదితరు అనుబంధ పదార్థాలు తయారు చేసే పరిశ్రమను తెలంగాణాలో ఏర్పాటు చేయడం వల్ల గీత కార్మికులు వృత్తి పరమైన ఆర్థికాభివృద్ధిని పొందడమే కాకుండా, వాల్యూ అడిషన్, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జర్మన్ ప్రతినిధి సీఎంకి వివరించారు. తెలంగాణ కల్లు యూరప్ కి ఎగుమతి స్థానికంగా కల్లు దుకాణాల ఏర్పాటు.. గీత కార్మికులకు కనీసం ఆదాయం పెంపుదల ఇతర రాష్ట్రాలు & ఇతర దేశాలకు మార్కెటింగ్ విస్తరణ తో పాటు రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ విభాగం ఏర్పాటు చేయడం, తాటి ఈత మొక్కలు త్వరగా పెరిగి అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాల తయారుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.