viralvideo2022: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ‘చిక్నీ చమేలీ’ ఐటెంసాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో అందరీకీ తెలిసిందే. 2012 లో రిలీజైన అగ్నిపథ్ లోని ఈపాటకు ఇప్పటీకి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. తాజాగా ఓ స్కూల్ అమ్మాయి ఈపాటకు తమదైన స్టెప్పులతో డ్యాన్స్ వేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కత్రినా కైఫ్ ను అనుకరిస్తూ స్టూడెంట్ చేసిన డ్యాన్స్ నెటిజన్స్ నూ ఫిదా చేసింది.
View this post on Instagram
ఇక వీడియో చూసినట్లయితే .. ముసుగు ధరించిన అమ్మాయి క్లాస్ రూమ్ లో చిక్నీ చమేలి సాంగ్ కు తనదైన స్టెప్పులతో దుమ్ములేపింది. ఆఅమ్మాయి డ్యాన్స్ కు తోటి విద్యార్థులు..ఈలలు .. కేకలు వేస్తూ ప్రోత్సహించారు. ఇది టీచర్స్ డే సందర్భంగా విద్యార్థినులు సెలబ్రేట్ చేసుకున్న వీడియోగా తెలుస్తోంది.ఈవీడియోనూ ఫంటాప్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది.దీంతో వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు ఈ వీడియో ఇప్పటికే 11 వేల లైక్స్ ను సొంతం చేసుకుంది.