దేశంలో తగ్గిన పసిడి ధర..

పండుగ సీజ‌న్‌లో ప్ర‌జ‌ల‌కు బంగారంలాంటి వార్త అందింది. గ‌త నాలుగు రోజులుగా దేశంలో బంగారం రేటు పెరుగుతూ పోయిన పసిడి ధరలు గురువారం తగ్గాయి. ఈ రోజు మాత్రం త‌గ్గిన‌ట్లు తెలుస్తుంది. ఇక ఈనాటి గోల్డ్ ప్రైజ్‌ను గ‌మ‌నిస్తే, 22 క్యార‌ట్‌ బంగారం ధ‌ర పది గ్రాములకు గాను 47 వేల 130 రూపాయ‌లుగా ఉంది. 24 క్యార‌ట్ బంగారం ప‌ది గ్రాములు 48 వేల 130 రూపాయ‌లుగా ఉంది. ఇక దేశ‌వ్యాప్తంగా ప‌లు న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లను చూస్తే… చెన్నైలో 22 క్యారెట్ 45 వేల 80 రూపాయ‌లు, 24 క్యారెట్ బంగారం 49 వేల 180 రూపాయ‌లుగా ఉంది. అదే, హైద‌రాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 44 వేల 750 రూపాయ‌లుగా ఉంటే, 24 క్యారెట్ గోల్డ్ 48 వేల 820 రూపాయ‌లుగా ఉంది. ఇక‌, బెంగ‌ళూరు, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం న‌గ‌రాల్లోనూ ఇవే ధ‌ర‌లు క‌నిపిస్తున్నాయి.