పండుగ సీజన్‌లో ప్రయాణీకుల సౌకర్యార్థం భారతీయ రైల్వే దాదాపు 668 పండుగ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. దేశవ్యాప్తంగా వివిధ రైల్వే సెక్టార్ల ప్రధాన గమ్యస్థానాలు కనెక్ట్ అయ్యే విధంగా ఈ ప్రత్యేక రైళ్లను ప్లాన్ చేశారు.
కాగా ప్రత్యేక రైళ్లతో పాటు రెగ్యులర్ రైళ్లకు అదనపు కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని నిర్వహణా సిబ్బందిని కూడా పెంచబోతున్నాట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో ప్రకటించింది.