ఆర్ఆర్ఆర్ ‘నాటునాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు…

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లిన రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ మూవీకి ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటునాటు’ పాటకు అవార్డు కైవసం చేసుకుంది. అమెరికాలో నిర్వహించిన అవార్డుల వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు కీరవాణి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. RRR చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంపై చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.

ఇక పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఇందులో హాలీవుడ్ , బాలీవుడ్ కు చెందిన పలువురు నటులు కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచం వ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్లు వర్షం కురిపించడంతో పాటు పలు అవార్డులను గెలుచుకుంది.ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

Related Articles

Latest Articles

Optimized by Optimole