Bonalu: తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేది బోనాలు అని ఈ పండుగ జరుపుకోవడానికి ప్రభుత్వం సహకరిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని మూసాపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం ఆమె టి పి సి సి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ తో కలిసి బోనాల పండుగను పురస్కరించుకొని ఆలయాల వద్ద సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం విడుదల చేసిన చెక్కులను సంబంధిత ఆలయ కమిటీలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ… తెలంగాణలో తొలి పండుగ బోనాలని వీటిని నిర్వాణ కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ ,బ్లాక్ అద్యక్షులు, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.