గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో భాజపా ప్రభంజనం సృష్టించింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్ లో.. ఆదివారం ఆరు కార్పొరేషన్లలోని 576 డివిజన్లకు ఎన్నికలు జరగ్గా 466 చోట్ల విజయం సాధించి భాజపా సత్తా చాటింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 45 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) 27 డివిజన్లను గెలుచుకొని బోణి కొట్టింది. ఎంఐఎం ఏడూ స్థానాలను కైవసం చేసుకొంది. కాాగా ఆప్ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగి 27 స్థానాలను గెలవడంతో కార్యకర్తల్లో జోష్ నింపేదుకు పార్టీ అధ్యక్షుడు క్రేజీవాల్ సూరత్ లో నిర్వహించే విజయోత్సవ ర్యాలీకి హాజరుకానున్నారు.