పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం బెంగాల్ పర్యటించిన ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. అధికార తృణమూల్ నేతల కారణంగానే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదని అన్నారు. ఇల్లు అద్దెకిచ్చిన.. అద్దెకు తీసుకున్న వారి ఇరువురి నుంచి డబ్బులు వసూలు చేస్తు రెండువైపులా సంపదిస్తున్నారని మోదీ అన్నారు. ఈ సంస్కృతికి చరమ గీతం పాడాలంటే బెంగాల్లో కమల వికసించాలని మోదీ పేర్కొన్నారు.
ఇక తృణమూల్ తాజాగా లేవనెత్తిన సొంత కూతురు నినాదం గురించి ప్రధాని స్పందిస్తూ.. తాగడానికి నీళ్లు లేక ఆర్జిస్తున్నా బెంగాల్ ఆడబిడ్డలపై కనికరం చూపలేని ప్రభుత్వం ఈ అంశాన్ని లేవనెత్తడం ఆశ్చర్యంగా ఉందని మోదీ అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ నీళ్లు అందించేందుకు చేపట్టిన జల్ జీవన్ మిషన్కి కేంద్రం 1700 కేటాయిస్తే అందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కేవలం 609 కోట్లు మాత్రమే అని మోదీ పేర్కోన్రు.