ఈశాన్య రాష్ట్రాల పై కాంగ్రెస్ సవతి ప్రేమ: మోదీ

గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలపై సవతి ప్రేమను ఒలకబోసాయని  ప్రధాని మోదీ విమర్శించారు. సోమవారం ఆస్సాంలో పర్యటించిన ప్రధాని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. స్వాత్రంత్రం వచ్చిన తర్వాత దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఈశాన్య రాష్ట్రాలలో, విద్య, వైద్యం, పరిశ్రమలు వంటి విషయాలను  నిర్లక్ష్యం చేసిందని మోదీ అన్నారు. అసోం అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసిపనిచేయాలని మోదీ సూచించారు. కాగా పర్యటనలో భాగంగా 3,300 కోట్ల పధకాల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు.