AyodhyaRammandir: అయోధ్య బాల రాముడిని హనుమంతుడు దర్శించుకున్నాడు అంటూ శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామయ్య పరమ భక్తుడైన హనుమయ్య అయోధ్య నగరానికి ఎప్పుడు వచ్చాడు? ట్రస్ట్ ఈ పోస్ట్ ఎందుకు చేసింది? తెల్సుకుందాం..!
హిందువుల ఆరాధ్య దైవం బాల రాముడు 550 ఏళ్ల తర్వాత జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో కొలువు దీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం రామ్ లల్లా దర్శనానికి వానరం దక్షిణ ద్వారం గుండా గర్భగుడి లోకి ప్రవేశించింది. రామయ్య విగ్రహం వరకువెళ్లి ఆలయ సిబ్బంది పట్టుకునే లోపు ఉత్తర ద్వారం గుండా వెళ్ళిపోయినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
మరోవైపు రామ్ లల్లా ఆలయ ట్రస్ట్ వానరం గర్భగుడిలోకి ప్రవేశించిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో తన స్వామిని దర్శించుకునేందుకు హనుమంతుడు వచ్చాడని.. రామలక్ష్మణ జానకి.. జై బోలో హనుమాన్ కి అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.